‘సాక్షి’ దినపత్రికకు బలం ఫీచర్స్ సెక్షన్ ‘ఫ్యామిలీ’యే. మరి, ఆ ఫ్యామిలీకి బలం? సినిమా! మిగతా దినపత్రికల ఫీచర్స్ పేజీలతో పోలిస్తే సినిమా వార్తలు కవర్ చేయడానికి ‘సాక్షి’ ఎక్కువ ఆరాటపడుతుంది. సినిమా వార్తలతో సాక్షి ఫ్యామిలీలో పేజీలకు పేజీలు నింపేసిన రోజులున్నాయి. ప్రస్తుత ‘సాక్షి’ ఫీచర్స్ (ఫ్యామిలీ) ఎడిటర్ ప్రియదర్శిని రామ్ నటుడు, దర్శకుడు. ఆయన ఎడిటర్‌గా చేసిన సమయంలోనూ, ఇప్పుడూ సినిమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆయన మాత్రమే కాదు… ఆయన గైర్హాజరులో ఫీచర్స్ ఎడిటర్లుగా పని చేసిన వాళ్లూ అంతే. సినిమాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. కొన్ని రోజులు ఫ్యామిలీ ఎడిటర్‌గా సాక్షికి సేవలు అందించిన ఇందిర పరిమి కూడా అదే కోవలోకి వస్తారు. డబుల్ ధమాకా ఇంటర్వ్యూలతో సినిమా ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్న ఈవిడ చాలా ఫేమస్ అయ్యారు. ఆ పరిచయాలు నిర్మాణంపై ఆసక్తి కలిగించాయో? అంతకు ముందు నుంచీ ఆమె మనసులో నిర్మాతగా మారాలనే కోరిక బలంగా వున్నదో? మెల్ల మెల్లగా చిత్రనిర్మాణంవైపు ఆమె అడుగులు వేస్తున్నార్ట. కొన్ని రోజులుగా కథలపై చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఆసక్తి గల ఎన్నారైలను నిర్మాణంలో భాగస్వామ్యులుగా చేర్చుకోవడానికి సిద్ధంగా వున్నారని తెలుస్తోంది. సినిమా జర్నలిజం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినవాళ్లు ఎక్కువగా నటన, రచన, దర్శకత్వం విభాగాల్లో సెటిల్ అయ్యారు. ప్రొడక్షన్లోకి వచ్చినవాళ్లు అరుదుగా కనబడతారు. సక్సెస్ అయ్యారు. ఒక బీఏ రాజు, ఒక సురేష్ కొండేటి మాత్రమే నిర్మాతలుగా నిలదొక్కుకున్నారు. ఇందిర పరిమి ఏ మేరకు రాణిస్తారో చూడాలి!!