2010లో విశాఖ గీతం యూనివర్శిటీ భూముల్ని ఆక్రమించుకుందంటూ సాక్షిలో రాసిన కథనాలపై అప్పట్లోనే ఆ సంస్థ పరువు నష్టం దావా వేసింది. రూ కోటి చెల్లించాలని ఆదేశించింది. ఆ దావాపై విచారణ జరిగిన కోర్టు ఇన్నాళ్లకు .. సాక్షి తప్పుడు రాతలు రాసిందని.. గీతం యూనివర్శిటీ పరువుప్రతిష్టలకు భంగం గలిగేలా చేసిందని నిర్ధారిస్తూ.. రూ. ఐదు లక్షల జరిమానా విధించింది. వడ్డీతో సహా కట్టాలని ఆదేశిచింది.
పదమూడేళ్ల కిందట నుంచే గీతంపై సాక్షి పత్రికలో ఇష్టం వచ్చిటనట్లుగా కథనాలు రాసేవారు. ఆ కథనాలపై గీతం యాజమాన్యం వివరణ ఇచ్చినా పట్టించుకునేవారు కాదు. ఆ భూముల వివాదం కోర్టులో ఉన్నప్పటికీ ఇటీవల ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు. ఆ భూములను మార్కెట్ రేటుకు ఇవ్వాలని వైఎస్ హయాంలోనే దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. తప్పుడు ప్రచారాలు చేయడానికే అన్నట్లుగా ఉండే సాక్షి మాత్రం ఇవన్నీ పట్టించుకోలేదు.
ఎంవీవీఎస్ మూర్తి ఇప్పుడు చనిపోయారు. ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ నెల ఐదో తేదీన సాక్షికి జరిమానా విధిస్తూ తీర్పు వచ్చింది. అయితే .. తీర్పు ఇచ్చిన జడ్డి తర్వాత రోజే బదిలీ కావడం చర్చనీయాంశం అయింది. విశాఖలోనే మరో కోర్టుకు జడ్జిని బదిలీ చేశారు.