ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నప్రతీ పథకానికి మొదటి లబ్దిదారులు సీఎంజగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియానే. మీటలు నొక్కడానికి ముందే ఆ పత్రికకుపెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తారు. రూ. కోట్లు వెదజల్లుతారు. ఇప్పుడు అసలు ఒక్క లబ్దిదారును ఎంపిక చేయక ముందే… కల్యాణముస్తు, షాదీ తోఫా పథకం వెబ్సైట్ను ప్రారంభించిన వెంటనే… రూ. కోట్లు పెట్టి ఫుల్ పేజీయాడ్స్ ఇచ్చారు.గత ప్రభుత్వం అమలు చేసిన కల్యాణమస్తు, షాదీ తోఫాను జగన్ నిలిపివేశారు. మేనిఫెస్టోలో పెట్టినట్లుగా రూ. లక్ష ఇస్తామని చెప్పి ఇంత కాలం వాయిదా వేశారు.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయం.. కోర్టుల్లో కేసులు కూడా పడటంతో చివరికి అమలు చేస్తామని జీవో ఇచ్చారు. దానికి కూడా పదో తరగతి అర్హత పెట్టడంతో అర్హులయ్యేవారు తగ్గిపోయారు. నిరుపేదల్లో పదో తరగతి వరకూ చదివేవారు తక్కువగా ఉంటారు. చదువుల్ని ప్రోత్సహించేందుకంటూ కొత్త కబుర్లు చెబుతున్నారు. లబ్దిదారుల్ని తగ్గించేందుకు ఏ అర్హతలుఉండాలో వెదికి మరీ పెడుతున్నారు.. కానీ సాక్షికి ప్రకటనలు ఇవ్వడానికి మాత్రం అర్హతల్ని సడలించారు.
నిబంధనల ప్రకారం సాక్షి దినపత్రి సర్క్యూలేషన్్లో రెండో స్థానంలో ఉంది. ఏ విధంగా చూసినా సాక్షికి అన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ ఇస్తున్నారు. పథకాల పేరుతో ప్రజలకు రూపాయి.. పంచి..ప్రకటనల పేరుతో రూ. వంద నొక్కేస్తున్నారన్న ఆరోపణలు ఈ కారణంగానే వస్తున్నయి. కల్యాణమస్తు పథకం వెబ్ సైట్ మాత్రమే ప్రారంభించారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు. గత ప్రభుత్వంలో ఈ పథకం అమలైంది. అప్పట్లో ప్రాసెస్లోఉన్న దరఖాస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాచూసినా… సాక్షి పత్రిక అన్ని పథకాల్లో మొదటి లబ్దిదారుగా కనిపిస్తోంది.