పది మంది లబ్దిదారులకు పది లక్షలు పంచడానికి రూ. యాభై కోట్లు పెట్టి ప్రకటనలు ఇచ్చే రేంజ్ నుంచి ఇప్పుడు మార్గదర్శికి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చే వరకూ ఏపీ ప్రభుత్వ నిర్వాకం వచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్‌ను ఏదేదో చెద్దామని చాలా కాలంగా విశ్వప్రయత్నాలు చేసి.. చీప్ గా ఇంట్లోకి వెళ్లి ఫోటోలు తీసుకువచ్చి… అదే ఘనకార్యం అని ప్రకటించుకునే స్థితి నుంచి దిగజారిపోయిన ఏపీ సర్కార్ పెద్దలు ఇప్పుడు .. ప్రజాధనాన్ని ఆ సంస్థ కోసం ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడం కోసం వెచ్చించడం ప్రారంభించారు.
ఆదివారం పూట సాక్షిలో రెండు తెలుగు రాష్ట్రాల ఎడిషన్లతో పాటు కూలీ మీడియా మొత్తం మార్గదర్శి చందాదారులకు నోటీసులు పేరుతో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేశారు. ఎందుకంటే మార్గదర్శి లో కొన్ని చిట్స్ లో నిబంధనలు పాటించడం లేదు.. వాటిని క్లోజ్ చేస్తున్నాం.. ..దాని కోసం ఫిర్యాదులు కావాలి.. ఆ ఫిర్యాదుల కోసం ఆ ప్రకటన. కనీసం రూ. యాబై కోట్ల రూపాయలు వెచ్చించి ఉంటారు. మార్గదర్శిలో చిట్స్ మూసేయాలనుకుంటున్న చిట్స్ మొత్తం కూడా అన్ని కోట్లు ఉండవు. మరి ఎవరి సొమ్ము అని ఇంత ఖర్చు పెట్టి పేపర్ ప్రకటనలు ఇచ్చారు.
మార్గదర్శిని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. అది అసహనంగా మారుతోంది. పుచ్చి ముదరింది రోకలి తలకు చుట్టమన్నట్లుగా పాలకుల తీరు ఉంది. ఇలాంటి ఎన్ని ప్రకటనలు వేసినా.. పోలోమంటూ తమ డబ్బులు తమకు ఇచ్చేయమని ఎవరూ అడగరు. ఎందుకంటే… అవి డిపాజిట్లు కావు. ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో కానీ… రాను రాను మార్గదర్శి ఎంత బలంగా ఉందో ప్రజలకు నిరూపిస్తున్నట్లుగా మారుతోంది. రామోజీరావుపై ప్రజల్లో ఇంత నమ్మకం ఉందా అని అందరికీ సాక్ష్యాలు పంపిస్తున్నారు.