వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార గెజిట్ లాంటి… సాక్షి పత్రిక… ఆ పార్టీ నేతల ప్రకటనలను కూడా .. ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ… కొత్త తరహా జర్నలిజాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది. రాజధాని మార్పుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోదంని.. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనను.. సాక్షి పూర్తిగా పక్కన పెట్టేసింది. పత్రికలో.. టీవీలో కూడా.. చోటివ్వలేదు. ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టు… విజయసాయిరెడ్డి చేసిన.. ఓ కీలకమైన ప్రకటనకూ.. అదే తరహా ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏపీలో తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలన్నింటినీ… మోడీ , షాలకు చెప్పే తీసుకుంటున్నామని.. ఢిల్లీలో ఆయన మీడియాకు.. నిర్మొహమాటంగా చెప్పారు. ఈ వార్తను.. సాక్షి పత్రిక.. పూర్తిగా హైడ్ చేసింది. రైల్వే మంత్రిని కలిసిన వార్తలో.. ఒక్క లైన్‌గా రాసి.. కనపడనివ్వకుండా చేసింది.
పీపీఏల సమీక్ష, పోలవరం రివర్స్ టెండర్లపై… కేంద్రం నుంచి.. తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. పదే పదే లఖలు కూడా.. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో… తాము మోడీ, షాలకు చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అంటే… వైసీపీ ఈ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నట్లే. అయితే… సాక్షి పత్రిక మాత్రం… ఈ వార్తకు ప్రాధాన్యం కల్పించలేదు. అసలు విజయసాయిరెడ్డి.. ఢిల్లీలో … కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన వార్తకే ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన ఫోటో కూడా.. వేయలేదు. చివరి పేజీలో మాత్రమే.. ఈ వార్తకు చోటు కల్పించారు. అందులోనూ… రైల్వేకు సంబంధించిన వినతిపత్రంలో ఉన్న విషయాలనే ప్రస్తావించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… తమ పత్రికలో ప్రాధాన్యం ఇవ్వలేదంటే.. కేవలం అది.. రాజకీయం కోసం చేసిన ప్రకటనగా భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. తమ నిర్ణయాలను కేంద్రం.. వ్యతిరేకిస్తోందన్న భావన రాకుండా ఉండటానికే.. విజయసాయిరెడ్డి ఇలాంటిప్రకటన చేసి.. ఇతర మీడియా ద్వారా ప్రజల్లోకి పంపారని.. తమకు సంబంధం లేదని తప్పించుకోవడానికి సాక్షిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వాదన.. వినిపిస్తోంది. మొత్తానికి సాక్షి పత్రిక కూడా.. వైసీపీ రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా… కవరేజీని మార్చుతూ… సరికొత్త జర్నలిజాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది.