హైటెక్ మోసాల గురించి జర్నలిస్టులు కథలు కథలుగా రాస్తూంటారు. కానీ జర్నలిస్టులే చేసిన మోసాలను అలా రాయడం అరుదు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. సాక్షి దినపత్రిక జర్నలిస్టులు.. ఓ స్వచ్చంద సంస్థ చెక్కులను ఫోర్జరీ చేసి.. కోటిన్నర నొక్కేసిన వెలుగు చూసింది. సంచలనం రేపుతోంది. వైజాగ్ కు చెందిన ఓ స్వచ్చంద సంస్థకు చెందిన కార్యాలయంతో ఏ సందర్భంలో పరిచయం అయిందో కానీ…విశాఖ సాక్షి ప్రతిని.. చెక్కులు తెచ్చుకున్నారు. వాటిని ఫోర్జరీ చేసి.. వరుగా డబ్బులు డ్రా చేసుకున్నారు. సంస్థకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు బయటపడింది. విశాఖ పోలీసులు సాక్షి జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపు లోనికి తీసుకున్న వారిలో మంగళగిరి సాక్షి కార్యాలయం లో పనిచేసే సబ్ ఎడిటర్ యడ్లురి ఆనంద్, తుళ్లూరు సాక్షి విలేకరి మేడా.తులసిరామ్, విశాలాంధ్ర విలేకరి గోచిపాతల.సిరివర్ధన్, బాలరాజు ఉన్నారు.
వైజాగ్ సాక్షి ప్రతినిధి నేతృత్వం లో మంగళగిరి మండలం పెడవడ్లపూడి కార్యాలయం లోని సబ్ ఎడిటర్, తుళ్లూరు సాక్షి విలేకరి అధ్వర్యం లో నడిచిన లావాదేవీలు…నడిచాయి. చెక్ ఫోర్జరీ చేసి.. నిందితులు దాదాపు రూ.1కోటి 40 లక్షలు వరకు వివిధ ఖాతాలలోనికి బదిలీ చేసారు. మీడియాలో పని చేసిన అనుభవంతో.. ఒకే ఖాతాకు.. అదీ తమ ఖాతాలకు నగదు బదిలీ చేసుకుంటే సమస్య అవుతుంది.. ఇతరులకు రూ. ఆరు వేల కమిషన్ ఇచ్చి..వాటిల్లో జమ చేయించారు. కింది స్థాయి ఉద్యోగులు, సహచర ఉద్యోగుల ఖాతాలలోనికి నిధులు మళ్లించారు. దాదాపు 26 ఖాతాలకు మూడు రోజులలో ఒక కోటి నలభై లక్షల వరకు బదిలీ అయ్యాయి. బాధిత సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు తో వైజాగ్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. అమరావతి లో రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. బుధవారం మధ్యాహ్నం నిందితులను అదుపులోకి తీసుకున్నారు వెంటనే వైజాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నగదు బదిలీ అయిన 26 మంది ఖాతా దారులను తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ చెక్కు మోసం వ్యవహారం మీడియా వర్గాలలో కలకలం రేపింది. మొదటగా… సాక్షి ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం కావడం. వేలల్లో జీతాలు తీసుకనేవారికి రోజుల్లోనే కోట్లలో లావాదేవీలు జరపడంతో.. ఇదేదో ఎన్నికల మిస్టరీ అనుకున్నారు. కానీ చివరికి పక్కా మోసం అని తేలడంతో..మీడియా వర్గాలు ముక్కున వేలేసుకున్నాయి.. కాకతాళీయంగా.. ఈ తరహా మోసానికి పాల్పడింది సాక్షి ఉద్యోగి కావడంతో..ఈ ఘనటకు మరింత ప్రాదాన్యం ఏర్పడింది.