“టీడీపీలో ఏదో జరుగుతోందని ఓ కథనం రాయడం వేరు..” .. దానికో సోర్స్ ఉందని చెప్పుకోవచ్చు..!
“టీడీపీ అంతర్గత మీటింగ్‌లో ఇలా జరిగిందని… లేనిపోనివి రాసుకోవచ్చు..” లోపలేం జరిగిందో… మేం చూశామని కవర్ చేసుకోవచ్చు..!
“భవిష్యత్‌లో టీడీపీ అంతర్ధానమైపోతుందని బ్యానర్ రాసుకోవచ్చు..!” ఆ మాత్రం విశ్లేషణ చేసే హక్కు సాక్షి మీడియాకు ఉంది…!
కానీ లోకేష్.. అనని మాటల్ని… అన్నాడని.. అదీ కూడా… ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో అన్నాడని.. బ్రేకింగ్‌లు వేసి.. కార్యకర్తల్ని, నేతల్ని కించ పరిచాడని… లోకేష్.. అదని.. ఇదని.. హడావుడి చేసి.. ఫోనోలు పెట్టి… వైసీపీ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టించి.. లోకేష్‌ని విమర్శింపచేస్తే ఏమొస్తుంది..?. అది ఏ రకం జర్నలిజం అవుతుంది.
లోకేష్ నిజంగానే ఆ మాటలు అని ఉంటే.. కచ్చితంగా బైట్ వేసి ప్రసారం చేయాలి. అలా అన్న లోకేష్ బైట్‌ని .. అనేక విధాలుగా ప్రసారం చేసి.. ఆయన అలా అన్నాడని చెప్పుకోవాలి. కానీ రోజంతా.. లోకేష్ అలా అన్నాడని దుష్ప్రచారం చేశారు కానీ… ఆయన అన్న మాటల్ని మాత్రం… బైట్ రూపంలో ప్రసారం చేయలేదు. కానీ… లోకేష్ అలా అన్నాడని… పార్థసారధి అనే నేత.. అరగంట పాటు ప్రెస్‌మీట్ పెట్టి లోకేష్‌ను విమర్శించారు. లోకేష్‌కు… సాక్షి ప్రసారం చేసిన వార్తలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే.. సాక్షి ఎడిటోరియల్ చీఫ్‌కు లేఖ రాశారు. తక్షణం మీడియా ముఖంగానే వివరణ ఇవ్వకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
సాక్షి టీవీలో వచ్చిన కథనాలు చూసి.. అసలు ఓటమి బాధలో ఉన్న టీడీపీ నేతలకు మండిపోయింది. తమపై ఇష్టమొచ్చినట్లు అసత్యప్రచారాలు చేసి… తప్పుడు ఆరోపణలతో.. ప్రజల్లో వ్యతిరేక భావన పెంచింది సాక్షినేనని… టీడీపీ నేతలకు.. ఇప్పటికే ఆగ్రహం ఉంది. ఓడిపోయిన తర్వాత కూడా… సాక్షి మీడియా ఇంత దారుణంగా.. వ్యవహరిస్తూండటంతో.. ప్రతీ విషయంలోనూ న్యాయపరంగా పోరాడాలని భావిస్తున్నారు. అయితే సాక్షి మీడియా ఆలోచన వేరు. వారు.. తమకు కావాల్సిన న్యూస్‌ను సృష్టించి.. టీడీపీలో ఏదో ఓ అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ పంచన చేరడానికి కొంత మందికి…. ఇలాంటి వార్తల ద్వారా సాక్షినే కృత్రిమ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి సాక్షి టీవీ చెప్పినట్లుగా… గుంటూరు టీడీపీ కార్యాలయంలో… లోకేష్ ప్రసంగించలేదు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో… ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో చంద్రబాబు సమక్షంలో.. ఓ మహిళా నేత.. ఆవేశంగా.. సొంత పార్టీ నేతల వల్ల టీడీపీకి ఈ పరిస్థితి వచ్చిందని ప్రసంగించారు. దాన్ని లోకేష్‌కు అన్వయించారు. తప్పు అని తెలిసినా కూడా సాక్షి… సర్దుకోలేదు. ఎందుకంటే.. కావాలని చేసిన తప్పును దిద్దుకోవాల్సిన అవసరం లేదు కదా..! . అయితే.. ఇప్పటికే సాక్షిని అదిగో పులి.. అంటే ఇదిగో తోక అనే టైపులో ప్రజలు అవగాహనకు వస్తున్నారు. ఇది మరింత బలపడితే… పట్టించుకునేవారు ఉండరు.