మాచర్లలో ఏం జరిగిందో.. దశ్యాలతో సహా.. ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేసింది. దాడులు చేసిన వారెవరో కూడా.. గుర్తు పట్టింది. వాళ్ల ట్రాక్ రికార్డు అంతా ఎలక్ట్రానిక్ మీడియా.. సోషల్ మీడియా బయటకు తీసింది. కానీ సాక్షి మాత్రం.. టీడీపీ నేతల కారు ఓ వికలాంగుడ్ని ఢీకొన్నదని.. స్థానికులు ఆగ్రహంగా వారిపై దాడి చేశారని.. ప్రచారం చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేశారు. దాని కోసం ఓ ఫోటోను కూడా వాడారు. వెంటనే.. సోషల్ మీడియా అది 2017లో జరిగిన ప్రమాదం ఫోటో అని బయట పెట్టింది. నిజానికి ఆ సమయంలో… టీడీపీ నేతలు వెళ్లిన రూట్లో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పలేదు. చివరికి హోంమంత్రి కూడా చెప్పలేదు. కానీ సాక్షి మాత్రం.. 2017 నాటి ఫోటోను మొదటి పేజీలో ప్రచురించేసింది. అది టీడీపీ నేతలు చేసిన యాక్సిడెంట్ అని చెప్పింది.
సాక్షి జర్నలిస్టు ప్రమాణాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ అసలు ప్రమాదమే జరగకుండా.. జరిగినట్లుగా చెప్పడానికి.. ఓ పాత ఫోటోను వాడేసుకుని..అదీ కూడా.. అందరికీ తెలిసిపోయి.. సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్‌ను వాడేసుకోవడం.. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. తమ పత్రికను చదివే పాఠకులు.. తాము ఏది చెబితే.. అదే నమ్మేస్తారన్న గుడ్డి నమ్మకంతో.. సాక్షి ఉన్నట్లుగా ఉంది. ఆ పత్రిక ఎడిటోరియల్ స్టాఫ్ కూడా.. ఈ విషయంలో అదే నమ్మకంతో ఉన్నట్లుగా ఉన్నారు. అక్కడ ప్రమాదం జరిగిదే.. స్థానికే దాడి చేసి ఉంటే… ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలుసు.
సరే.. సాక్షి మీడియా జగన్ ది కాబట్టి.. వైసీపీ కి తగ్గట్లుగా వార్తల్ని బయాస్ చేసుకోవాల్సిన అవసరం బాధ్యత.. ఆ పత్రిక ఎడిటోరిలయ్ స్టాఫ్ కు ఉండొచ్చు. కానీ ఇంత దారుణంగా… పాత ఫోటోలతో బయాస్ చేస్తే.. పోయేది జగన్ పరువే కానీ.. ఆ పని చేసిన జర్నలిస్టులది కాదు. ఈ విషయాన్ని ఎడిటోరియల్ స్టాఫ్ గుర్తిస్తారో.. లేకపోతే.. పోయేది పైవాళ్ల పరువే కదా అని లైట్ తీసుకుంటారో మరి..!