జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైలు యాత్ర చేశారు. కొంచెం వినూత్నంగా ఉన్న కాన్సెప్ట్ … మీడియా దృష్టిని ఆకర్షించింది. విజయవాడ నుంచి తుని వరకూ రైలు వెళ్లి .. ఆ రైల్లోనే కొన్ని వర్గాల వారిని పలకరించి సమస్యలు తెలుసుకుని .. చివరికి… తునిలో బహిరంగసభలో ప్రసంగించారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత చేసిన ప్రసంగం కావడంతో ప్రధాన పత్రికలన్నీ బాగానే కవర్ చేశాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ప్రచురించాయి. కానీ సాక్షి పత్రిక మాత్రం.. పన్నండో పేజీలో ఓ సాధారణ వార్తలా ప్రచురించింది. కనీసం.. తుని బహిరంగసభ ఫోటో కూడా వేయలేదు. పవన్ ప్రసంగంలో అసలు విషయాల్ని పక్కన పెట్టేసి.. రోజూ చెప్పే వాటినే ప్రచురించింది.
నిజానికి ఇటీవలి కాలంలో కేవలం చంద్రబాబునాయుడుని మాత్రమే.. పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకుంటున్నారు. తునిలోనూ అదే జరిగింది. పూర్తిగా.. టీడీపీని టార్గెట్ చేసుకుని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. చివరికి రాహుల్ గాంధీ తో చంద్రబాబు భేటీని కూడా విమర్శించారు. మోడీతో గౌరవంగా మాట్లాడుకుని రాష్ట్రానికి కావాల్సిన వాటిని తెచ్చుకోవాలని సుద్దులు చెప్పారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడికి సంబంధించి.. టీడీపీ నేతల ప్రకటనలపైనా విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో ఎక్కడా.. జగన్‌ను విమర్శించలేదు. అయినా సరే… సాక్షి పత్రిక మాత్రం… పవన్ కల్యాణ్‌కు ప్రధానమైన కవరేజీ ఇవ్వడానికి మొహమాట పడింది.
కొన్నాళ్లుగా… వచ్చే ఎన్నికల్లో జగన్ – పవన్ కలసి పని చేస్తారని… ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కల్యాణ్ పై సాఫ్ట్ గా ఉంటున్నారని.. కూడా చెప్పుకొస్తున్నారు. అయితే… వైసీపీ నుంచి మాత్రం… ఆ తరహా ట్రీట్మెంట్ ఉండటం లేదు. దూరం పెడుతూనే ఉన్నారు. పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై.. వైసీపీ నేతలకు ఇంకా నమ్మకం చిక్కలేదన్న భావన… జగన్ మీడియాలో.. పవన్ కు వస్తున్నప్రాధాన్యత తెలిసిపోతోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా…అంతే ఉంటుంది. చంద్రబాబు ఇంటికొచ్చి అడిగితే తానే మద్దతిచ్చేవాడినంటూ… ఆయన చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ అగ్రనేతల్లో… అసహనానికి గురి చేసి ఉంటాయని చెబుతున్నారు. పవన్ పై నమ్మకం పెట్టుకోలేమని.. వీలైనంతగా.. దూరంగా వ్యవహారాలు నడుపుదామని… అనుకుంటున్నారని.. దాని ఫలితంగానే.. ఉండీ ఉండనట్లుగా కవరేజీ ఇస్తున్నారని చెబుతున్నారు.