కియా పరిశ్రమ తమిళనాడుకు వెళ్తుందని.. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించడంతో… ఏపీ సర్కార్ అధికార గెజిట్ లాంటి… సాక్షి పత్రికకు.. చాలా పని పడింది. అదంతా.. చంద్రబాబు రాయించాడని.. చెప్పుకోవడానికి.. తన శక్తి యుక్తులన్నింటినీ కేంద్రీకరించింది. అన్ని కోణాల్లోనూ.. విశ్లేషించి.. చివరికి ఆ వార్త.. చంద్రబాబే రాయించాడని… చెప్పే ప్రయత్నం చేసింది. కియా తరలింపుపై … జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం అని చెప్పుకునేందుకు రాసిన ప్రధాన కథనంలోనే చంద్రబాబు గురించి పరోక్ష ప్రస్తావన తీసుకొచ్చారు.
మీడియా మేనేజ్మెంట్లో ఆరి తేరిన వ్యక్తి అంటూ… చంద్రబాబుపై తాము చేసే ఆరోపణల్ని గుర్తుకు తెచ్చారు. ఆ తర్వాత వెంటనే.. రాయిటర్స్ సంస్థకి గత ప్రభుత్వం అనేక కాంట్రాక్టులిచ్చిందని..ఓ కథనం ఆ ప్రధాన వార్త కిందనే ప్రచురించారు. ఈ-ప్రగతి నిధులు రాయిటర్స్కు వెళ్లాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. రాయిటర్స్ సంస్థ.. చంద్రబాబు కోసం… చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం.. ఈ వార్త రాసందన్న కలర్ కనిపించేలా.. చేయడానికి సాక్షి పత్రిక తన శాయశక్తిలా ప్రయత్నించింది.
అదే సమయంలో.. రాయిటర్స్ జర్నలిస్ట్ ఆదిత్య కర్లాకి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేసింది. ఆయన ట్విట్టర్ ఖాతాను.. ట్విట్టర్ స్తంభింపచేసినట్లుగా రాసేసింది. ట్విట్టర్.. రాయిటర్స్ జర్నలిస్ట్ ట్విట్టర్ ఖాతాను స్తంభింపచేయడం అసాధ్యం. వారు రాసిన న్యూస్ నిజమో.. అబద్దమో.. ట్విట్టర్ ఎలా డిసైడ్ చేస్తుంది..? ఈ మాత్రం అవగాహన లేకుండా.. సాక్షి పత్రిక జర్నలిస్టులు.. కియా తరలిపోవడం లేదని… ప్రచారం అంతా చంద్రబాబు కుట్రేనని చెప్పుకోవడానికి… తన ప్రతిభ అంతా ప్రదర్శించారు.