ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన కుటుంబ వ్యాపారాలకు ప్రజాధనంతో ఏదైనా లావాదేవీ నిర్వహించాలంటే భయపడతారు. ప్రజలు ఏమనుకుంటారో అని అనుకుంటారు. పారదర్శకమైన టెండర్ల ద్వారా దక్కించుకున్నా సరే ప్రజలు నమ్మరనుకుంటారు . కానీ వీటన్నింటికీ జగన్ అతీతం. ప్రజల డబ్బు నేరుగా తమ కంపెనీల ఖాతాల్లోకి పంపడానికి అదీ కూడా వందల కోట్లను స్వాహా చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడరు. అస్మదీయులైన అధికారుల్ని పెట్టుకుని …తర్వాత తేడా వస్తే వారిని బలి చేసి తాము బయటపడేలా ఆ దోపిడీ చేస్తారు. కానీ అసలు లబ్దిదారుల్ని చట్టం వదిలి పెట్టదని అర్థం చేసుకోలేకపోయారు.
ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా పని చేసి..సాక్షి పత్రికకు వందల కోట్లు దోచిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన విజయ్ కుమార్ రెడ్డిని విచారణకు పిలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా సర్క్యులేషన్ లేని పత్రికకు వందల కోట్ల ప్రకటనలు ఎందుకివ్వాల్సి వచ్చిందో ఆయన ఒక్క మాటతో సరి పెట్టారు. నాటి ప్రభుత్వ పెద్దల అదేశాల మేరకే తాను అలాంటి ప్రకటనలు ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ప్రభుత్వంలోని పెద్దలెవరు.. ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అన్నది మాత్రం ఆయన చెప్పడం లేదు.
ఒక్క సమాచార, ప్రసార శాఖ ద్వారానే ఆరేడు వందల కోట్లు ఒక్క సాక్షికి.. వారి అనుబంధ సంస్థలకు వెళ్లాయి. ఇతర అస్మదీయులైన మీడియాకు అందులో సగం ఇచ్చారు. తాము శత్రువులుగా భావించే మీడియాకు అసలు ఇవ్వలేదు. ఇలా చేయడం చట్ట విరుద్ధం. ప్రభుత్వాధినేతల చేతుల్లో ఉన్న పత్రికకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం వెళ్లిందంటే.. నేరుగా దోపీడీ చేసినట్లే.. ఇప్పుడు దానికి వారే బాధ్యులవుతారు. విజయ్ కుమార్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా.. సాక్షి యాజమాన్యానికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి.