సాక్షి పత్రిక సర్క్యూలేషన్ అత్యంత దారుణంగా పడిపోయింది. ప్రింట్ ఆర్డర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం నాలుగు లక్షలు కూడా లేకపోవడంతో .. ఇష్టం వచ్చినట్లుగా ప్రింట్ చేసి.. దానిపై కాంప్లిమెంటరీ కాపీ అని స్టాంప్ వేసి అడగకపోయినా ఇళ్లల్లో పడేస్తున్నారు. మనుషుల్ని పెట్టి మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రిక మొత్తం ప్రజాధనంతో బతికేసింది. వందల కోట్ల ప్రకటనలు మాత్రమే కాదు.. ప్రజాధనంతో రోజూ లక్షల కాపీలు కొనుగోలు చేసేవారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మామూలు ఉద్యోగులు, యూనివర్శిటీలు ఇలా దేన్నీ వదలకుండా ప్రతి ప్రభుత్వ వ్యవస్థలోనూ సాక్షి పేపర్ ను ప్రజాధనంతో చొప్పించేవారు. ప్రభుత్వం పోయిన తర్వాత ఆ సర్క్యూలేషన్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు అది నాలుగు లక్షలకు చేరినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో కూడా పట్టించుకునేవారు లేరు. ఏపీలో అయితే చెప్పాల్సి న పని లేదు. వారికి ఏపీలో అవసరం కాబట్టి.. కాంప్లిమెంటరీ కాపీలు వేస్తున్నారు. సంవత్సర చందా కేవలం 1250 రూపాయలు మాత్రమేనని చేరాలని బతిమాలుతున్నారు. అంతే కాదు.. గతంలోలా ఓ కుక్కర్ లేదా ఇంకో గిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏడాది సబ్ స్క్రిప్షన్ రూ. 1250 పెట్టి తీసుకుంటే అందులో సగం మొత్తం.. గిఫ్టు రూపంలో ఇచ్చేస్తారన్నమాట. అంటే సాక్షి మళ్లీ… రెండు రూపాయల స్టేజ్ కు వచ్చింది.
అక్రమ సంపాదనతో .. ప్రజాధనం దోచుకుని బతికేస్తోంది సాక్షి. పత్రిక పెట్టినప్పటి నుంచి అదే బతుకు. దోచిన డబ్బులున్నాయని అప్పట్లో రూ. రెండుకే పేపర్ ఇస్తూ.. ఇతర పత్రికలు కూడా అదే రేటుకు ఇవ్వాలని ఉద్యమం చేశారు. ఇప్పుడు అన్ని పత్రికలతో పాటు ఆరు రూపాయలకు అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు తప్పుడు మార్కెటింగ్ వ్యూహాలతో రెండు రూపాయలకే దిగిపోయారు.