ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు… తీసుకున్న విధానాలను ప్రముఖంగా ప్రచురించిన సాక్షి పత్రిక కథనాలు.. ఇప్పుడు ఆయనకు చిరాకు తెప్పిస్తున్నాయి. సాక్షి పత్రిక తప్పు రాసిందంటూ.. సన్నబియ్యం విషయంలో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారమే తీవ్ర విమర్శల పాలవుతూండగా.. కొత్తగా… ఇంగ్లిష్ మీడియం విషయంలోనూ.. అదే ఇబ్బంది ఆయనకు ఎదురయింది. గతంలో.. తమ ప్రభుత్వం.. పట్టణాల్లోని పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే వ్యతిరేకించింది మీరేనని చంద్రబాబు మండిపడ్డారు. దానికి సాక్ష్యంగా.. సాక్షి పత్రికలో కథనాలు ఉదహరించారు.
ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకంగా సాక్షిలో వచ్చిన కథనాలను చంద్రబాబు ప్రస్తావించడంతో.. జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఏది చేసినా రాజకీయం చేస్తున్నారని.. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా 2016లో సాక్షిలో ఏదో వచ్చిందని ఇప్పుడు.. రగడ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సాక్షి కథనాలను.. ఖండిస్తున్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సన్నబియ్యం విషయంలో చెప్పినట్లుగా సాక్షి తప్పు రాసిందని నేరుగా చెప్పలేకపోయారు. కానీ.. ఆ కోపం మాత్రం.. ప్రతిపక్ష నేతపై చూపించారు. ప్రైవేటు స్కూల్స్‌ను చంద్రబాబు ప్రోత్సహించారని మండిపడ్డారు.
గతంలో చంద్రబాబు సర్కార్ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పత్రిక సాక్షిలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాయించారు. ఇప్పుడు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే ప్రముఖంగా అమలు చేస్తున్నారు. దీంతో.. గతంలో వ్యతిరేకించి.., ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారన్న విమర్శలు ప్రధానంగా వస్తున్నాయి. తాము గతంలో వ్యతిరేకించలేదు అని చెప్పడానికి అవకాశం లేకుండా.., సాక్షి పత్రిక రూపంలో రికార్జులు ఉన్నాయి. అవి పదే పదే రోజూ.. హైలెట్ అవుతూండటం.. తన నిర్ణయాలు యూటర్న్‌ను తలపిస్తూండటంతో.. జగన్ … సాక్షిపై అసహనానికి గురవుతున్నారు.