ఆంధ్రప్రేదశ్‌కు ప్రత్యేకహోదాను కేసీఆర్ అండ్ టీం.. పార్లమెంట్ వేదికగా అడ్డుకుందున్నది ఎంత నిజం అంటే… కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడేనని.. తల నరుక్కుంటాను కానీ మాట తప్పనని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పినంత నిజం. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి… ఆ పార్టీ అధినేత జగన్‌కు తెలియదనిదేం కాదు. అయినప్పటికీ… ఏపీ ప్రత్యేకహోదా కోసం.. నేనేం అడ్డం .. పొడుగు కాదని… ప్రెస్మీట్లో చెప్పి.. ఓ లేఖ రాస్తారని చెప్పగానే.. అది వైసీపీకి .. ఆ పార్టీ మీడియాకు బ్రాహ్మాండం అయిపోయింది. వెంటనే బ్యానర్ స్టోరీ రాసేశారు. అయితే కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వాలనుకుంటే.. కేసీఆర్ లేఖతో ఏం పని..? ఇప్పుడు ఆయన లేఖ రాస్తానని ఎందుకుంటున్నారు..? దాన్ని సాక్షి మీడియా పత్రిక ఎందుకంత పెద్దగా ప్రచారం చేసుకుంటోంది…?
కేసీఆర్.. బీజేపీకి మద్దతుదారు. ఢిల్లీలో ఆయనకు కావాల్సింది..మోడీ మళ్లీ ప్రధానమంత్రి కావడం. జగన్‌కూ అదే కావాలి. అందుకే.. ఏపీ ప్రయోజనాలను బీజేపీ… ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. ఆయన నోరు మెదపడం లేదు. కానీ.. ప్రత్యేకహోదా సెంటిమెంట్ ప్రజల్లో ఉంది. ప్రత్యేకహోదా ఇవ్వనని చెబుతున్న బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోతున్నా.. ఆ పార్టీతో కలవలేకపోతున్నారు. నేరుగా కలిస్తే.. ప్రజలు .. ఓటుతో తరిమికొడతారు. అందుకే.. ఇద్దరూ కలిసి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ప్రత్యేకహోదా పేరుతో ఇద్దరూ కలిసి ఓ ఫ్రంట్ పెట్టబోతున్నారు. ఇతర పార్టీలేవీ అందులో ఉండకపోయినా.. ఇద్దరూ కలిసి 30 సీట్లు గెల్చుకుని.. మోడీని మళ్లీ ప్రధానిని చేయడానికి తాపత్రయ పడుతున్నారు. అలా మోడీ ప్రధాని అవడం వల్ల వాళ్లకేంటి లాభమో.. వాళ్లకు తెలుసు..! సామాన్య ప్రజలకూ తెలుసు.
అందుకే సాక్షి పత్రిక.. ప్రత్యేకహోదా పై లేఖ రాస్తామనగానే… బ్యానర్ స్టోరీ అచ్చేసింది. అంతే కానీ.. గతంలో.. ఆయన ట్రాక్ రికార్జును పరిగణలోకి తీసుకోలేదు. సాక్షికి అవసరం లేదు కూడా. ఎలాగోలా బీజేపీకి మద్దతు పలకాలంటే… ప్రత్యేకహోదా విషయంలో కాస్తంత.. సాఫ్ట్ వైఖరి ఉన్న వారికి దగ్గరవ్వాలి. అది కేసీఆర్ ద్వారా సాధ్యం. అందుకే… కేసీఆర్ కూడా.. వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి సాక్షి మీడియా ప్రీప్లాన్డ్ గా ప్రచారం ప్రారంభించింది.