గత ఐదేళ్లుగా చంద్రబాబుకు చేసిన అవమానాల్ని చూసిన జనం… జగన్కు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని లెక్కలేసుకుంటున్నారు. అంతకు మించి అన్నట్లుగా చుక్కలు చూపిస్తారని అనుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా ఆయనకు అదనపు గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నేత కూడా కాకపోయినప్పటికీ ఆయనకు సీఎం కాన్వాయ్ అలాగే ఉంది ఇంకా తీసుకోలేదు. ఆయన కారును అసెంబ్లీ లోపలికి అనుమతించారు. అల్ఫా బెటికల్ ఆర్డర్ లో కాకుండా… మంత్రులంతా ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణం చేయించారు.
ఈ గౌరవం చూసి చాలా మంది టీడీపీ సానుభూతిపరులు, ప్రజలు కూడా చంద్రబాబు ఇక మారడని అనుకున్నారు. అసెంబ్లీలో జగన్ ను అవమానించవద్దని ముందుగానే కూటమి సభ్యులకు చంద్రబాబు స్పష్టం చేశారు. దాంతో ఎవరూ జగన్ ను అవమానించలేదు. ప్రశాంతంగా ప్రమాణస్వీకారం చేసుకుని జగన్ వెళ్లిపోయారు. ఇంత గౌరవం వచ్చినా సాక్షిలో మాత్రం అగౌరవపరిచారని కథనాలు రాసుకుంటున్నారు. దీనిపై సామాన్య జనంలో విస్మయం వ్యక్తమవుతోంది.
సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్… అల్ఫాబెటికల్ ఆర్డర్ లో ప్రమాణం చేయాలి. లఅలా చేస్తే చివరిగా వస్తారు. అందుకే ఆయనకు మంత్రులంతా ప్రమాణం చేసే అవకాశాన్ని ఇచ్చారు. ప్రజలు కూడా ఇవ్వని గౌరవాన్ని ప్రభుత్వం కల్పించినా ఇంకా అవమానించారని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే జగన్ రెడ్డి లాంటి వాళ్లకు గౌరవం ఇచ్చినా అవమానమేనని అలాంటి వారితో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహిరంచాలన్న సలహాలు టీడీపీ నేతకు అన్ని వైపుల నుంచి వెళ్తున్నాయి.