రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అధినేతలు పత్రికలు ప్రారంభించుకున్న తర్వాత.. వార్తల స్వరూపం మారిపోయింది. అది ఎలా ఉంటుందంటే… ఈ రోజు సాక్షి పత్రిక మొదటి పేజీ చూస్తే అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తామని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ..25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ… స్పష్టంగా ప్రకటించారు. ఇది ఏఐసిసి నిర్ణయం అన్నారు. దాంతో.. ఏపీలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు లేదని క్లారిటీ వచ్చింది. కానీ ఈ రోజు పేపర్లో సాక్షి పత్రిక తన మొదటి పేజీలో ఏం రాసింది..? . “హస్తంతోనే సైకిల్ సవారీ” అని బ్యానర్ పెట్టేసింది. ఎందుకంటే.. తమ పార్టీకి అది కావాలి. వాళ్లు పొత్తు పెట్టుకుంటే తమకు లాభం అనుకున్నారు.. పెట్టుకోకపోయే సరికి… పెట్టుకున్నట్లే అన్నట్లుగా ప్రచారం ప్రారంభించారు.
అసలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చి చెప్పిన తర్వాత… వాళ్లు తెర వెనుక కథలు నడుపుతున్నారని.. రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారని.. ఓట్లు చీల్చుతున్నారని.. లాంటి కథనాలు చాలా రాసుకోవచ్చు. కానీ.. అసలు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందనే నిర్ణయాన్ని ప్రధానంగా చెప్పకుండా.. ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టేసుకున్నట్లుగా.. అర్థం వచ్చేలా టైటిల్ పెట్టి… దానికి మళ్లీ “పరోక్షం”గా అంటూ సమర్థింపులు చేసుకోవడం… సాక్షి మార్క్ జర్నలిజానికి… అచ్చమైన సాక్ష్యంలా కనిపిస్తోంది.
ఇంకా ఈ కథనంలో.. మూర్చబోయే కొత్తదనం ఏమిటంటే జనసేనతో .. కూడా… అలాంటి పొత్తే.. అంటే పరోక్ష పొత్తే పెట్టుకోబోతోందట. దానికి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను ఉదహరించారు. కానీ పవన్ కల్యాణ్ అంత కంటే ఘాటుగా స్పందించారు పవన్ మీద. ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే.. సాక్షి మాత్రం తన యజమానికి ఉడతాభక్తి సాయం చేస్తూ… వైసీపీ మినహా అన్ని పార్టీలు ఒకటే…అని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. దాని కోసం… తన ఇమేజ్ను కాపాడుకుంటూ… అసలు జరిగిన దానికి భిన్నంగా రిపోర్ట్ చేస్తూ.. పాఠకుల్లో ఉన్న.. కొద్ది పాపులారిటీని కూడా మిస్సవుతోంది.