న్యాయవ్యవస్థపై రెండు, మూడు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో దాడి చేసిన సాక్షి మీడియా ఈ రోజు పూర్తిగా వ్యూహం మార్చింది. ఒక్కటంటే.. ఒక్క వార్తను.. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచురించలేదు. సాధారణంగా మీడియా ప్రచారంతో తాము ఎంచుకున్న న్యాయమూర్తులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి .. సుప్రీంకోర్టు సీజేఐకి రాసిన లేఖను.. కల్లం అజేయరెడ్డితో విడుదల చేయించి… హంగామా చేయించారు. అది కంటెప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని … కనీస అవగాహన ఉన్న వారికి కూడా తెలుసు కాబట్టి.. చాలా మీడియా సంస్థలు ఆ కవరేజీ ఇవ్వలేదు. అయితే సాక్షి టార్గెట్ మీడియా ప్రచారమే కాబట్టి.. అ ప్రకారం… తన మీడియాలో చేయాల్సినంత రచ్చ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బొమ్మనే ప్రధానంగా వేసి కథనాలు.. .అవినీతి ఆరోపణలు చేసేసింది.
దీనిపై అనుకూల జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. తమ వాదనకు.. ఎంతో బలం ఉందన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నించింది. కానీ హఠాత్తుగా… ఈ వార్తలన్నింటినీ ఆపేసింది. తమకేమీ తెలియదన్నట్లుగా ఇతర వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి కారణం … సుప్రీంకోర్టులో దాఖలయిన కోర్టు ధిక్కార పిటిషన్ అని అనుమానిస్తున్నారు. గతంలో ఉన్న కేసుల తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే.. ఏపీ ప్రభుత్వం.., సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ప్రచార దాడి చేసి.. తీవ్రమైన తప్పు చేసిందన్న అభిప్రాయం.. న్యాయవాద వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో.. సాక్షి తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా భావిస్తున్నారు.
చేయాల్సిన ప్రచారం ఇక చేసేశాం కాబట్టి.. ఇక నుంచి బయట వ్యక్తులే ఎక్కువగా చర్చిస్తారని.. తమ పని అయిపోయిందని.. సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి గురించి ఎలాంటి ప్రచారం చేయాలనుకుంటున్నామో.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిపోయామని.. ఇప్పుడు ఏ కోర్టులు స్టే ఇచ్చినా ప్రయోజనం ఉండదని.. ఇక ప్రత్యేకంగా సాక్షిలో కథనాలు రాయాల్సిన అవసరం లేదన్న వ్యూహం వైసీపీ అగ్రనేతలు పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి సాక్షి వెనక్కి తగ్గినట్లుగా అనుకోలేం కానీ.. ఇది కూడా పక్కా వ్యూహం అని..అనుకోవచ్చు.