పోలింగ్ ముగిసిన వెంటనే సాక్షి తెరపై యాంకర్ ఈశ్వర్ ఇచ్చిన ఓ స్పీచ్ ఇప్పటికీ ట్రోలింగ్ స్టఫ్ గా ఉంది. కాల్చండి టపాసులు.. అంటూ జగన్ కు ఇచ్చిన ఎలివేషన్ చూసి చాలా మంది నవ్వుకున్నారు. ఎన్నికలు అయిపోయాక ఆ వీడియోను టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తిప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మరో వీడియోను వదిలారు సాక్షి ఈశ్వర్. ఈ సారి ఎలివేషన్లు లేవు.. ఆర్తనాదాలు ఉన్నాయి.
దేవుడా.. ఓ మంచి దేవుడా మమ్మల్ని కాపాడాలి అంటూ.. ఆయన వాయిస్ లో బేస్ మార్చి … ప్రాక్టిస్ చేసి మరీ వీడియో తీసినట్లుగా ఉన్నారు. దాడులు జరిగిపోతున్నాయని..తమను వేధిస్తున్నారని… ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… అంటున్నారు. సాక్షిలో ఇలాంటివి చెప్పే ముందు … గత ఐదేళ్లలో రోజుకొకటి చొప్పున జరిగిన ఘోరాలు ప్రజల కళ్ల ముందు మెదులుతాయని రైటర్లు గుర్తించలేకపోతున్నారు. తన ఓవరాక్షన్ తో ఈశ్వర్ వాటిని గుర్తు చేసేలా చేస్తున్నారని అనుకోలేకపోతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బూతులు … అధికారం పోయాక నీతులు చెబితే ఆర్తనాదాలు కూడా కామెడీ అవుతాయి. ఇప్పుడదే జరుగుతోంది. అధికారాన్ని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా దెబ్బతీయాలో చూపించారు. జగన్ రెడ్డి నుంచి చాలా నేర్చుకున్నానని చంద్రబాబునాయుడే అన్నారు. జగన్ చూపించిన బాటలో తమపై రెచ్చిపోయిన వారికి చుక్కలు చూపించకుండా ఉంటారు.
వ్యవస్తల్ని నాశనం చేసి… కక్షసాదింపుు ఎలా ఎలా చేయాలో చూపించారు… వారు అంతకు మించి చేస్తారు… ఇప్పుడెంత ఏడ్చినా ప్రయోజనం ఉండజదు. అందుకే వ్యవస్థల జోలికెళ్లవద్దు … వ్యవస్థల్ని రక్షిస్తే.. అది మిమ్మల్ని రక్షిస్తుందని అని పదే పదే చెప్పింది.