వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని సాక్షి పత్రిక మత మార్పిళ్లకు మద్దతుగా ఓ ఉద్యమం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇతర మతాల కంటే… క్రిస్టియానిటీ గొప్పదన్నట్లుగా…ఓ ప్రణాళికా బద్ధమైన ప్రచారాన్ని సాక్షి ప్రారంభించింది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో క్రీస్టియానిటి గురించి గొప్పగా… కథనాలు రాస్తున్నారు. దీనికి మరో అడుగు ముందుకేసి ఇప్పుడు.. మేధావుల పేరుతో.. ఎడిటోరియల్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు. తెలంగాణకు చెందిన కంచె ఐలయ్య అనే ప్రోఫెసర్తో.. ఈ రోజు.. మతం మారితే తప్పు లేదనే ఆర్టికల్ రాయించారు. పైగా మతం మారితేనే… అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయనతో చెప్పించారు. మతం మారిన మహిళలే గొప్పగా ఎదిగారని.. ఓ ఆరెస్సెస్ నివేదికలో తేలిందనే… ప్రచారాన్ని కూడా దీనికి జోడించారు.
కంచె ఐలయ్య సాక్షి పత్రిక కోసం రాసిన వ్యాసంలో ప్రధానంగా.. మహిళల మత మార్పిడిని ప్రోత్సహించారు. మత మార్పిడికి వ్యతిరేకంగా ఉన్న అన్ని వ్యతిరేక చట్టాలను కట్టడి చేయాలని కూడా పిలుపునిచ్చారు. ప్రధానంగా కంచె ఐలయ్య.. సాక్షి కోసం రాసిన ఆర్టికల్లో ఆరెస్సెస్ను టార్గెట్ చేశారు కానీ.. దాని వెనుక నిగూఢమైన లక్ష్యం మాత్రం మత మార్పిడులను ప్రోత్సహించడమేనని సులువుగానే అర్థమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో ఓ మతం ప్రభావం పెరిగిపోయిందని.. మత మార్పిళ్లు పెరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ ఆలయాల్లో అన్యమతస్తులు చొరబడుతున్నారు. రిజర్వేషన్ పేరుతో.. ఆలయ బోర్డుల్లోకి.. అన్యమతస్తులను చొప్పించారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
రాజకీయంగా మరింత బలపడాలంటే… ఏపీలో మత మార్పిళ్లు ఎక్కువగా జరిగేలా చూడాలనేది.. వైసీపీ విధానమని… కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మత మార్పిడి చేసుకున్న వారు ఎక్కువగా… జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. గిరిజనల్లో ఉద్ధృతంగా సాగిన మత మార్పిడి కారణంగానే… ఆయా వర్గాల ప్రజలకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసినా.. వారి చర్చిల్లో చెప్పినట్లుగా జగన్ కు ఓట్లు వేస్తారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో.. ఏపీ సర్కార్ తీరుపై.. ఆరెస్సెస్ కూడా గుర్రుగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆరెస్సెస్ తీరును తీవ్రంగా విమర్శిస్తూ.. మత మార్పిళ్లకు ప్రోత్సాహం ఇస్తూ.. కంచె ఐలయ్యతో ఆర్టికల్ రాయించడం… కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కంచె ఐలయ్య.. హిందువుల్ని దారుణంగా తిడుతూ.. పుస్తకాలు వేసి.. పబ్లిసిటీ పొందిన ప్రొఫెసర్.