తెలుగులో ఓ సామెత ఉంటుంది.. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ నేతలు.. ఆ పార్టీ అధికారిక మీడియా ఎప్పుడూ ఈ సామెతను ప్రస్తావిస్తూ ఉంటుంది. టీడీపీ రంగు పసుపును పచ్చగా అభివర్ణిస్తూ… ఇంకా ఎక్కువ వాడేస్తూ ఉంటుంది. ఇప్పుటు పచ్చ కామెర్ల సంగతేమో కానీ..సాక్షి మీడియాకు మాత్రం… టీడీపీ నేతలందరూ కరోనా రోగుల్లాగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్న వారందరికీ కరోనా ఉందని సాక్షి మీడియా ప్రచారం చేస్తోంది. టీవీల్లో బ్రేకింగ్‌లు వేసి మరీ హంగామా చేస్తోంది. దీంతో టీడీపీ నేతలు… సాక్షి మీడియాపై దారుణమైన భాషలో విరుచుకుపడుతున్నారు.
టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగపూడి అనిత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తిరుపతి ప్రచారంలో ఉన్నారు. అయితే వారికి కరోనా వచ్చిందని… తిరుపతి టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం అని సాక్షి మీడియా హడావుడి చేసింది. అయితే సాక్షి మీడియా ప్రచారం చేసిన వారిలో ఎప్పుడో కరోనా వచ్చి ఇప్పుడు తగ్గిపోయిన జవహర్ లాంటి వారు ఉన్నారు. అలాగే అసలు కరోనా పాజిటివ్ రాని అనిత, గుమ్మడి సంధ్యారాణి కూడా ఉన్నారు. సాక్షిలో తమ పేర్లతో .. తమకు కరోనా అని ప్రచారం చేయడంపై వారు మండిపడ్డారు. సిగ్గూ, లజ్జా లేకుండా మీడియాను నడుపుతున్నారని తిట్లు లంకించుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని కరోనా కారణంగా వాయిదా వేసుకుంటున్నానని ప్రకటించారు. దీనికి బలం కల్పించడానికి టీడీపీ నేతలందరికీ కరోనా అని సాక్షి జర్నలిస్టులు క్రియేట్ చేసినట్లుగా ఉన్నారు. మీడియా అంటే.. తప్పుడు వార్తలు రాసి.. ప్రజల్లోకి ఏదో ఓ రకమైన తప్పుడు ప్రచారం పండానికే అన్నట్లుగా వైసీపీ మీడియామారిపోయిందని.. నిజం ఉందో లేదో కానీ… నమ్మేవారు నమ్ముతారన్న ఉద్దేశంతో సాక్షి ఇలాంటి వార్తలు వండి వారుస్తోదని అంటున్నారు. మొత్తానికి ఎక్కువ మంది నమ్మేదే నిజమని సాక్షి అనుకుంటోంది. ఆ ప్రకారం…తాను అనుకున్నదాన్ని ప్రచారం చేసి ఎక్కువ మందిని నమ్మించాలని అనుకుంటోంది. అదే జరుగుతోంది. అక్కడ జర్నలిజం విలువలు… మట్టి..మశానం వంటి వాటికి చాన్స్ లేదు.