ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. హీరోయిన్స్ విషయంలో అవి మరింత బలంగా వుంటాయి. వరుసగా నటించిన రెండు సినిమాలు ఫ్లాపులు కొడితే మరో అవకాశం రావడం కష్టం. ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అయితే కొన్నిసార్లు ఈ సెంటిమెంట్ ని దాటి అవకాశాలు వస్తుంటాయి. సాక్షి వైద్య కూడా ఇలానే ఓ అవకాశం అందుకుంది.
అఖిల్ ఏజెంట్ సినిమాతో తొలి అవకాశం అందుకుంది సాక్షి. ప్రొమోషనల్ కంటెంట్ చూసి ఇండస్ట్రీకి మరో ప్రామెసింగ్ హీరోయిన్ దొరికిందని అనుకున్నారంతా. కానీ అ సినిమా డిజాస్టర్. సాక్షి నటనకు కూడా యావరేజ్ మార్కులే పడ్డాయి. తర్వాత వరుణ్ తేజ్ తో చేసిన గాండివధారి అర్జున మూవీ కూడా మరో డిజాస్టర్. దీంతో సాక్షి కి డబుల్ షాక్ తగిలింది. ఇలాంటి సమయంలో ఓ మంచి అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్ళింది. శర్వానంద్ రామ్ అబ్బరాజు కలసి చేస్తున్న సినిమాలో సాక్షిని హీరోయిన్ గా తీసుకున్నారు. రెండు ఫ్లాపులతో వెనకబడ్డ సాక్షికి ఇది సూపర్ ఛాన్సే.