తిరుమల తిరుపతి దేవస్థానంలో.. తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డిని నియమించడంపై సాక్షి పత్రిక కూడా.. పెద్దగా కవరేజీ ఇవ్వలేదు. చాలా.. చాలా చిన్న వార్తను… జీవోలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పీ చెప్పకుండా.. చెప్పి.. మ..మ అనిపించింది. గతంలో ఇదే శేఖర్ రెడ్డిపై… పేజీలకు పేజీలు రాసిన చరిత్ర సాక్షికి ఉంది.అలాంటిది ఇప్పుడు తమ ప్రభుత్వమే ఆయనను మళ్లీ టీటీడీ బోర్డులోకి తీసుకొచ్చి పెట్టే సరికి.. ఎలా సమర్థించుకోవాలో సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్కు కూడా అర్థమయినట్లుగా లేదు. అందుకే… చెప్పీ చెప్పకుండా వదలిశారు.
శేఖర్ ఏజే అని రాసి ప్రజల కళ్లకు కంతలు కట్టగలరా..?
శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో నియమించడానికి సిద్ధమైన సర్కార్ … అంతకు ముందు తాము చేసిన ఆరోపణలకు.. ఎలా ముసుగేయాలా అని ఆలోచించింది. అందుకే.. పేరు మారిస్తే సరిపోతుంది కదా.. అని… శేఖర్ రెడ్డి పేరను.. శేఖర్ ఏజేగా మార్చేసి. జీవోలో అదే ఇచ్చారు. ఇలా చేస్తే.. ప్రజలకు అర్థం కాదని.. వాళ్లను.. సులువుగా మోసం చేయగలుగుతామని అంచనా వేసినట్లుగా ఉన్నారు. కానీ ఈ వ్యవహారం అంతా అమాయకంగా ఉంది. పేరులో రెడ్డి అని లేకుండా… జీవో జారీ చేసినంత మాత్రాన..ఆయన శేఖర్ రెడ్డి కాకుడా పోతారా.. రేపు అందరి ముందు వచ్చి.. ప్రమాణ స్వీకారం చేసినప్పుడైనా తేలిపోతుంది కదా..! అప్పుడైనా ప్రజల్ని మోసం చేసినట్లుగా తేలిపోతుంది కదా..! కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే ముందుగానే అందరికీ తెలిసిపోయింది. రహస్యంగా ఉంచడం వల్ల మరింతగా ప్రచారం పొందుతోంది.
దాచి పెట్టే ప్రయత్నం చేసి మరింత అభాసుపాలయిన సర్కార్..!
శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తనను.. టీటీడీ బోర్డులోకి తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. అప్పుడే… తెలుగు360 అసలు విషయాన్ని బయట పెట్టింది. ఆయనను టీటీడీ బోర్డులోకి తీసుకోబోతున్నారని.. స్పష్టం చేసింది. ఇప్పుడు.. దాన్ని.. సర్కార్ నిజం చేసింది. అయితే.. శేఖర్ రెడ్డిని తీసుకుంటున్నట్లుగా నేరుగా ప్రకటిస్తే.. డామేజ్ కొంత తక్కువగా ఉండేది. కానీ ఆయన పేరును దాచి పెట్టే ప్రయత్నం చేసి.. కొత్త పేరుగా పరిచయం చేసి.. ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ ను ప్రజల్లోకి పంపేశారు. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
క్లీన్ చిట్ వచ్చిందని ఎదురు దాడి చేయబోతున్నారా..?
శేఖర్ రెడ్డి వందల కోట్ల కొత్త నోట్లతో దొరికినప్పుడు.. అందరికీ ఆశ్చర్యమే. ఎందుకంటే… అప్పట్లో.. ఒక్క రెండు వేల నోటు కోసం జనం క్యూల్లో ఉన్నారు. కానీ కొత్త నోట్ల తడి ఆరక ముందే… అవి నేరుగా శేఖర్ రెడ్డి ఇంట్లోకి చేరాయి. అలా వచ్చి చేరాయంటే.. పెద్దల హస్తం లేకుండా ఉండదు. ఆ పెద్దలెవరనేది ఎవరికీ తెలియదు. అప్పట్లో.. టీటీడీ బోర్డులో ఉన్నారు కాబట్టి.. చంద్రబాబు బినామీ అని .. చాన్స్ దొరికినట్లుగా.. జగన్ తో పాటు.. ఆయన మీడియా బురద పూసేశారు. అయితే.. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనప్పుడే ఆయనకు క్లీన్ చిట్ వచ్చింది. వెంటనే… జగన్ ఆయనను బోర్డులోకి తీసుకున్నారు. దీంతో.. ఆయన వెనుక ఉన్న బినామీలెవరో అన్న చర్చ కొత్త ప్రారంభమయింది. ఆయనకు క్లీన్ చిట్ వచ్చిందని.. అందుకే బోర్డులోకి తీసుకున్నామని… చంద్రబాబు అన్యాయంగా ఆయను పదవి నుంచి తీసేస్తే తాము న్యాయం చేశామని.. రేపట్నుంచి ఎదురుదాడి చేసినా.. ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే… ఆ స్థాయి వారికి ఉంది.