వైసీపీ పత్రిక సాక్షి చాలా వీక్ గా కనిపిస్తోంది. ఆరోపణలు చేయడానికి .. బురద చల్లడానికి మధ్య గీతను సృష్టించలేకపోతోంది. ఫలితంగా రాజకీయంగా బురదచల్లుతోందని అందులో నిజం లేదని చిన్నపిల్లాడికి తెలిసిపోయేలా స్టోరీలు ఉంటున్నాయి. ముఖ్యంగా అమరావతి విషయంలో.. టెండర్ల విషయంలో చేస్తున్న ఆరోపణల్ని చూసి.. సామాన్యులు కూడా అబ్బా.. నిజమా అని అనుకుంటున్నారు. ఈ సామాన్యులు ఎవరో కాదు..సాక్షి ఫ్యాన్సే. ఆ పత్రికను వైసీపీ నేతలుతప్ప ఎవరూ కొనడం లేదు. సర్క్యులేషన్ అత్యంత దారుణంగా పడిపోయింది.
అమరావతిలో ఎస్ఎఫ్టీ నిర్మాణం రెండు వేలకు చేయాల్సింది.. ఆరేడు వేలకు టెండర్లు వేసి చేస్తున్నారట. ఈ రాతలు చూసి అందరూ రుషికొండ ప్యాలెస్ ను గుర్తు చేసుకుంటున్నారు. హోటల్ పేరుతో ఇళ్లు కట్టుకుని దాదాపుగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఇంటికి ఎస్ఎఫ్టీకి రెండు వేలే ఇచ్చారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ కనీసం ఒక్క ఎస్ఎఫ్టీకి లక్షకుపైగానే ఖర్చు పెట్టారని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దోపిడీ ఎంత.. అసలు ఎంత అన్నది తర్వాత విషయం.
ఎనిమిదేళ్లు కిందటితో పోలిస్తే ఇప్పుడు టెండర్లు 60 శాతం పెరిగాయని సాక్షి లెక్కలేసి చెబుతోంది. ఎనిమిదేళ్ల కిందటతో పోలిస్తే అరవై శాతమే పెరిగిందా.. అయితే మంచి టెండర్లే అని కాస్త పరిజ్ఞానం ఉన్న వాళ్లు అనుకుంటున్నారు. ఎనిమిదేళ్ల కిందటి ధరలతో పోలిస్తే ఇప్పుడు అన్నీ రెట్టింపు అయ్యాయని నిర్మాణ రంగంలో ఉన్న అందరికీ తెలుసు. సాక్షికే అర్థం కావడం లేదు. కానీ ఈ నష్టం ఎవరి వల్ల అనే ప్రశ్న కూడా చదివే వారికి వస్తుందని గుర్తించలేకపోతోంది.
అమరావతిని ఐదు సంవత్సరాల పాటు అడవిగా మార్చిన వైసీపీ … ప్రజాతీర్పు వచ్చిన తర్వాత అయినా సైలెంటుగా గా ఉంటే కాస్త పరువు నిలబడేది కానీ.. బురద చల్లాలన్న ప్రయత్నంలో ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటోంది.