ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ పై ముందు నుంచి అనుమానాలు వున్నాయి. సినిమా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా వున్నాయని ఇండస్ట్రీ లో వినిపించింది. సెప్టెంబర్ 28 సినిమా వచ్చే అవకాశం చాలా తక్కువని వినిపించింది. ఇప్పుడు అదే నిజమైయింది. సలార్ వాయిదా పడింది. డిసెంబర్ 14కి వెళ్ళిందని తెలుస్తోంది.
సెప్టెంబర్ లో లో సినిమా వస్తుంటే ఇప్పటికే పాటలు ప్రోమోలతో హడావిడి మొదలుకావాలి. కానీ అలాంటిది జరగలేదు. ఐతే ప్రశాంత్ నీల్ కంటెంట్ పై ద్రుష్టి పెట్టడాడని, పాటలు ప్రమోషన్స్ పెద్ద మేటర్ కాదని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు వీటికి భిన్నంగా జరిగింది.
వాయిదాకి కారణాలు చూసుకుంటే సలార్ సిజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని వినిపిస్తోంది. అలాగే బిజినెస్ పరంగా కూడా అనుకున్న ప్రీ రిలీజ్ టార్గెట్ ఇంకా జరగలేదని ఇన్ సైడ్ టాక్. ఏదేమైనా రెండు నెలలు దాటవేస్తూ ఏకంగా డిసెంబర్ కి వెళ్ళిపోవడం ఆదిపురుష్ తో నిరాశపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింత నిరాశ కలిగించే అంశం.
ఐతే సలార్ వాయిదాతో కొన్ని పెద్ద సినిమాల విడుదల వరుస మారింది. ఇందులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు ముందుకు వచ్చింది. అక్టోబర్ 20న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు సలార్ డేట్ కి మారింది. సెప్టెంబర్ 28న టైగర్ విడుదలౌతుంది.