ప్రభాస్ సలార్ రిలీజ్ ట్రైలర్ వచ్చింది. మొదట వచ్చిన ట్రైలర్ కంటే ఈ రిలీజ్ ట్రైలర్ కిక్ ఇచ్చింది. మొదటి ట్రైలర్ లో పృథ్వీరాజ్ క్యారెక్టర్ పైన ఎక్కువగా ద్రుష్టి పెట్టాడు ప్రశాంత్ నీల్. రెండో ట్రైలర్ లో మాత్రం ప్రభాస్ ఎంట్రీ అదరగొట్టాడు. ఈ ఎంట్రీ కోసం చెప్పిన ఫ్రాన్స్ రాజు కథ, ఆ క్రమంలో పోస్ట్ అయిన విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.
ప్రభాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన సీన్స్ ఆకట్టుకున్నాయి. ఖాన్సార్ ప్రపంచం, భారీ మిషన్ గన్స్ ని పేల్చిన విధానం. ‘ఖాన్సార ఎరుపెక్కలా’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్… ఎమోషన్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాయి. ‘అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను’అని పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ తర్వాత ప్రభాస్ రావడం, తర్వాత తెరపైకి వచ్చిన యాక్షన్ దృశ్యాలు డబుల్ ఇంపాక్ట్ ని ఇచ్చాయి. విజువల్స్, నేపధ్య సంగీతం దేనికవే పోటీపడ్డాయి.
ఇక చివర్లో ఈ కథలో అసలు పాయింట్ ఏమిటనేది కూడా చెప్పారు. బద్ద శత్రువులుగా మారిన ప్రాణ స్నేహితులు అని వాయిస్ ఓవర్ లో వినిపించిన డైలాగ్ ఈ కథలో సారాంశాన్ని వెల్లడించింది. సలార్ కథ విషయంలో ప్రశాంత్ నీల్ ఏమీ దాచుకోవడం లేదు. ప్రేక్షకులు ఏం చుదబోతున్నారో ముందే చెప్పేస్తున్నారు. ఒక విధంగా ఇది మంచిదే. స్నేహితులు, శత్రువులు గా మారడం చాలా సినిమాల్లో కనిపించింది. అయితే ఆ పాయింట్ ఎలాంటి చూపిస్తున్నామనేది ఇక్కడ అసలు మేటర్. ఈ ట్రీట్మెంట్ విషయంలో ప్రశాంత్ నీల్ కు చాలా నమ్మకం వుందని ఈ రెండు ట్రైలర్స్ చూస్తుంటే అర్ధమౌతుంది. ఈనెల 21వ నుంచే సలార్ షోలు మొదలైపోతున్నాయి.