ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగు రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును అడగలేదు. ఎక్కడా డిమాండ్ చేయలేదు. కానీ అనూహ్యంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల అనేక సమస్యలకు తాత్కాలికంగా అయినా పరిష్కారం లభిస్తుంది. ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనాలు ఉద్యోగులకు లభించనప్పటికీ రెండేళ్ల అదనపు సర్వీసు కల్పించడంతో వారంతా ఖుషీ అవుతున్నారు. ఫిట్‌మెంట్‌కు ఓకే చెప్పేశారు కూడా.
రెండేళ్ల సర్వీస్ పెంచి ఉద్యోగుల అసంతృప్తిని చల్లార్చిన జగన్ !
ఉద్యోగు రిటైర్మెంట్ను రెండేళ్లకు పొడిగించడం వల్ల సీఎం జగన్‌కు లభించే ముఖ్యమైన రిలీఫ్.. రిటైరయ్యే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ రెండేళ్ల పాటు ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులు తమ సర్వీసులో దాచుకున్న డబ్బులతో పాటు పలు రకాల బెనిఫిట్స్‌ను రిటైరయ్యే వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్థాయిని బట్టి.. కనకీం రూ. యాభై అరవై లక్షలు ఉంటుందన్న అంచనా ఉంది. ఇప్పటి వరకూ రిటైరైన వారికి ఇవ్వాల్సిన బకాయిలు రూ. రెండు వేల కోట్ల వరకూ ఉన్నాయని ఉద్యోగ సంఘ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. అంటే వచ్చే రెండేళ్లలోఇంత పెద్ద మొత్తం చెల్లింపులు చేసే అవసరం ఉండదు.
ఆర్థికంగా రిలీఫ్ – రాజకీయంగా లాభం !
ఓ రకంగా ప్రభుత్వానికి భారం కూడా అనుకోవచ్చు. ఎందుకుంటే ఓ సీనియర్ ఉద్యోగి జీతభత్యాలు రిటైరయ్యే స్థాయిలో అత్యధికం ఉంటాయి. ఆ అత్యధిక జీతాలతో మరో రెండేళ్లు ప్రభుత్వం సర్వీసు కొనసాగించాల్సి ఉంటుంది. ఇది భారమే. అదే రిటైర్మెంట్ కొనసాగించి ఉంటే… దిగువస్థాయి ఉద్యోగి నియామకం చేసుకుంటే… రిటైరయ్యే ఉద్యోగిలో ఇచ్చే జీతంలో 30 శాతం వరకే లభించే అవకాశం ఉంది. ఇది ఓ రకంగా ప్రభుత్వానికి భారం అనుకోవచ్చు.
నిరుద్యోగులు అసంతృప్తికి గురయ్యే అవకాశం !
ఉద్యోగులకు హ్యాపీసే అయినా నిరుద్యోగులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. ఇప్పటికే నోటిఫికేషన్లు రాలేదని అసంతృప్తిలో ఉన్న వారికి మరో రెండేళ్ల పాటు రిటైర్మెంట్లు లేవంటే ఇక ఉద్యోగాలు లేవనే అర్థం. వీరి అసంతృప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఇప్పటికే ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. వివిధ కారణాలతో యువతలో అసంతృప్తి ఉంది. వాటిని కవర్ చేయడానికి ప్రభుత్వం చాయా చేయాల్సి ఉంటుంది.
సంతృప్తి పడిపోయిన ఉద్యోగ సంఘాలు
మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సైలెంట్ అయిపోయేంత స్టఫ్‌ను ఒక్క నిర్ణయంతో సీఎం జగన్ తీసుకున్నారు. ఫిట్మెంట్ ఐఆర్ కన్నా ఎక్కువ ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నా.. తక్కువ ఇచ్చినా వారు నోరు మెదపలేకపోతున్నారు. తగ్గించినా చేసేదేమీ ఉండదని వారికి తెలుసు. అందుకే వచ్చినదానితో సరి పెట్టుకుంటున్నారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభఉత్వంపై అదనంగా రూ. పది వేల కోట్లకుపైగా భారం పడుతుందని సీఎం జగన్ చెప్పారు.. కొత్తగా పడే భారం ఏమీ ఉండదు.. ఇప్పటికే అమలు చేస్తున్న జీతాలే వస్తాయి.. ఇంకా లెక్కలు చూస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయి.