హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. అదే.. `భవదీయుడు భగత్ సింగ్`. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల హరీష్ శంకర్ – సల్మాన్ ఖాన్ మధ్య భేటీ జరిగింది. ఆ ఫొటోలూ బయటకు వచ్చాయి. దాంతో హరీష్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే… హరీష్ కలిసింది పవన్ కల్యాణ్ సినిమా కోసమే. చిరంజీవి `గాడ్ ఫాదర్`లో సల్మాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్‌పై ఓ ఫైట్, పాట తెరకెక్కించారు. ఇంకొంత షూటింగ్ మిగిలి ఉంది. ఇప్పుడు తమ్ముడు పవన్‌తోనూ… జట్టు కట్టబోతున్నాడన్నమాట. మరోవైపు వెంకటేష్ తో కలిసి సల్మాన్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హరీష్ మరోసారి… సల్మాన్‌ని కలిసినట్టు టాక్. మొత్తానికి సౌత్ సినిమాలపై సల్మాన్ బాగానే ఫోకస్ చేశాడన్నమాట.