1993 ముంబై వరుస ప్రేలుళ్ళలో ప్రధాన నిందితుడు టైగర్ మెమన్ తప్పించుకు పారిపోగా, ఆ ప్రేలుళ్ళకు డబ్బు సమకూర్చిన అతని సోదరుడు యాకూబ్ మీమన్ మాత్రం పోలీసులకి చిక్కాడు. అప్పటి నుండి అతనిపై ప్రత్యేక కోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. చివరికి సుప్రీంకోర్టు అతనికి ఉరి శిక్షని ఖాయం చేసింది. ఆ తరువాతఅతను రాష్ట్రపతికి క్షమాభ్క్ష పిటిషన్ పెట్టుకొన్నాడు. దానిని ఆయన తిరస్కరించడంతో ఈ నెల 30న నాగపూర్ జైల్లో అతనిని ఉరి తీయబోతున్నారు. దేశ వ్యాప్తంగా ముస్లిం నేతలు కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఇప్పుడు వారికి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా గొంతు కలిపారు. ఆయన ఒక ట్వీట్ మెసేజ్ లో ఈవిధంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. “గత మూడు రోజులుగా దీని గురించి ట్వీట్ చేద్దామని అనుకొంటున్నప్పటికీ వెనుకంజవేసాను. కానీ ఇది ఒక మనిషి ప్రాణానికి, ఒక కుటుంబానికి సంబందించిన విఒశయం కనుక ట్వీట్ చేస్తున్నాను. యాకూబ్ మీమన్ న్ని ఉరి తీయవద్దు. పోలీసులనుండి తప్పించుకు తిరుగుతున్న ఆ గుంట నక్క(టైగర్ మీమన్)న్ని ఉరి తీయండి. టైగర్ ని పట్టుకొని ప్రజల ముందు పెరేడ్ చేయిస్తూ తిప్పి మరీ ఉరి తీయండి కానీ యాకుబ్ మీమన్ న్ని ఉరి తీయవద్దు,” అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసారు.