సైరా షూటింగ్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ తరువాయి. చిరు డబ్బింగ్ కూడా పూర్తయిపోయినట్టు సమాచారం. ఇక… సైరా నుంచి చిరు బయటకు వచ్చి, కొరటాల సినిమా పనుల్లో పడిపోవొచ్చు. కొరటాలతో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరు బరువు తగ్గాలి. అందుకోసం కసరత్తులు కూడా షురూ అయిపోయాయి. చిరు కోసం ప్రత్యేకంగా ఓ ఫిట్ నెస్ ట్రైనర్ కూడా రంగంలోకి దిగాడు. సల్మాన్ ఖాన్ దగ్గర పని చేసిన ట్రైనర్.. ఇప్పుడు చిరంజీవి కోసం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్ – సల్మాన్ ఖాన్ మంచి మిత్రులు. అందుకే సల్మాన్ నుంచి ఈ సాయం అందింది. జూన్ మొదటి వారంలోనే చిరు 152 షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్‌ని కూడా తీర్చిదిద్దుతున్నారు. చిరు ఈ సినిమాలో రెండు పాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఓల్డేజ్ పాత్రపై సన్నివేశాలు తెరకెక్కిస్తారు. చిరు బరువు తగ్గాక.. మరో పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుంది.