హైదరాబాద్: తెలుగు రీమేక్లద్వారా కెరీర్‌ను పటిష్ఠంచేసుకున్న సల్మాన్ ఖాన్ దృష్టి ఇప్పుడు ‘శ్రీమంతుడు’మీద పడిందట. శ్రీమంతుడు తెలుగులో సెకండ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఇరోస్ ఇంటర్నేషనల్’ సంస్థ నిర్మించింది. దీంతో శ్రీమంతుడు హిందీ రీమేక్ గురించి సల్మాన్ ఇరోస్ సంస్థతో చర్చలు జరుపుతున్నాడట. తన బ్యానర్‌పై నిర్మించాలని సల్మాన్ యోచిస్తున్నాడని చెబుతున్నారు. దర్శకుడుగా సల్మాన్ ఎవరిని తీసుకుంటాడన్నది ఇప్పుడు బాలీవుడ్లో పెద్దచర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ఇప్పటికే మహేష్ చిత్రం పోకిరి, రామ్ – రెడీ, రవితేజ – కిక్ చిత్రాలను హిందీలోకి రీమేక్ చేసి మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అందుకే సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేయటానికి అతను పోటీపడుతుంటాడు. శ్రీమంతుడుతో తన ఖాతాలో మరో హిట్ వేసుకోవాలని సల్మాన్ చూస్తున్నాడు.