హైదరాబాద్: సల్మాన్ ఖాన్ తాజా చిత్రం బజరంగీ భాయిజాన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైన ఈ 15 రోజులలో రు.276 కోట్లు కొల్లగట్టి రు.300 కోట్ల మైలురాయివైపుకు దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ మైలురాయిని చేరింది ఆమిర్ ఖాన్ ఒక్కరే. ఆయన పీకూ చిత్రం కలెక్షన్స్ రు.300 కోట్లు దాటాయి. విదేశీ మార్కెట్లో బజరంగీ చిత్రం కలెక్షన్స్ రు.100 కోట్లను దాటాయి. మరోవైపు బాహుబలి హిందీ వెర్షన్ రు.100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. ఇప్పటికే రు.95 కోట్లు వసూలుచేసింది. మొత్తంమీద బాలీవుడ్లో ఖాన్ల ఆధిపత్యం మరోసారి స్పష్టంగా రుజువయింది. అత్యధిక వసూళ్ళు చేసిన పీకూ, బజరంగీ, కిక్2, ధూమ్3, చెన్నై ఎక్స్ప్రెస్, 3 ఇడియట్స్ చిత్రాలన్నీ ఖాన్ త్రయానివే.