‘ఏ మాయ చేసావె’, ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’… మూడుసార్లు చైతూ, సమంత జంటగా థియేటర్లలోకి వచ్చారు. ఈ సెప్టెంబర్ 13న కూడా ఇద్దరూ థియేటర్లలోకి వస్తున్నారు. అయితే… జంటగా కాదు. విడి విడిగా! నాగచైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత ‘యూ టర్న్’… రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కానున్న సంగతి తెలిసిందే. నిజానికి సెప్టెంబర్ 13 తేదీపై ముందు కర్చీఫ్ వేసింది సమంతే. ఆగస్టు 31న విడుదల కావలసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కేరళలో వరదల కారణంగా వాయిదా పడి… సెప్టెంబర్ 13కి వచ్చింది. ఈ విషయం తెలియగానే సమంత ఏమన్నారు? అని నాగచైతన్యను అడిగితే… “కొంచెం కోపంగా చూసింది. తన సినిమా విడుదల రోజున నా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ముందు సమంతకు చెప్పా. ‘ఫస్ట్ టైమ్ సోలో హీరోయిన్గా నేనొక సినిమా చేస్తున్నా. నువ్వు వచ్చి నా మీద పెడతావా?’ అని ‘యూ టర్న్’లో దెయ్యంలా ముఖం పెట్టింది. చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అయితే… రెండూ డిఫరెంట్ సినిమాలు కదా! అందులోనూ వినాయక చవితి పండగ రోజు. ప్రేక్షకులు రెండు సినిమాలూ చూస్తారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే మాట చెప్పడంతో విడుదల చేస్తున్నాం” అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “నా సినిమాను నువ్వు.. నీ సినిమాను నేను ప్రమోట్ చేద్దాం” అని చైతూ, సమంత అనుకున్నార్ట!