సమంత తొలిసారి సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం `ఓ బేబీ`. అటు అన్నపూర్ణ స్డూడియోస్, ఇటు సురేష్ ప్రొడక్షన్స్… రెండూ సమంతకు ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థల్లాంటివి. అందుకే `ఓ బేబీ` ప్రమోషన్ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే సురేష్ బాబు కంటే ఎక్కువగా కష్టపడింది. నిజానికి ఈ సినిమాని ముందు నుంచీ సురేష్ బాబు లైట్ తీసుకుంటూనే ఉన్నాడని టాక్. ఆఖరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ఆయన కనిపించలేదు. `మిస్ గ్రానీ` తెలుగులో వర్కవుట్ అవ్వదు అనేది సురేష్ బాబు నమ్మకం. అలాంటి జోనర్లు తెలుగులో ఆడవని, మిస్ గ్రానీని లోని ఫీల్‌ని తెలుగులో తీసుకురాలేమని ఆయన చెబుతూ వచ్చార్ట. స్క్రిప్టు పూర్తయి, రెండు రోజుల్లో సెట్స్‌పైకి వెళ్తుందనగా.. ఈ సినిమాని ఆపేయాలని సురేష్‌బాబు సూచించారని తెలుస్తోంది.
కానీ ఈ సినిమా ని తప్పకుండా హిట్ చేయాలన్నది సమంత, నందినిల పట్టుదల. ఈ సినిమాని నందిని రెడ్డి చేతుల్లో పెట్టింది కూడా సమంతనే. మిగిలిన నటీనటులు, సాంకేతిని నిపుణుల ఎంపికలోనూ సమంత హస్తం ఉంది. మిగిలిన కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి సమంత ఈ సినిమా కోసం భారీ ఎత్తున ప్రమోషన్లు కూడా చేసింది.`ఓ బేబీ` ఆడుతుందా? లేదా? అనే విషయంలో విడుదలకు ముందు రోజు వరకూ ఇదే డిస్కర్షన్ వీళ్లిద్దరి మధ్య నడిచిందని టాక్. మొత్తానికి సమంత మాటే గెలిచింది. సురేష్ బాబు అంచనా తప్పింది. అందుకే సమంత రెట్టించిన జోష్‌లో ఉందిప్పుడు. సురేష్బాబుది మాస్టర్ బ్రైన్. ఆయన కంటే సమంత కరెక్ట్‌గా ఊహించగలిగిందంటే – సమంతకు నిర్మాణ లక్షణాలూ అబ్బేస్తున్నాయన్నమాట.