గ్లామరెస్ బ్యూటీ సమంత త్వరలోనే దెయ్యంగా కనిపించబోతోందా?? ఆ అవకాశాలున్నాయంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న రాజుగారి గది 2లో సమంత నటిస్తోంది. ఇందులో ఆమెది దెయ్యం పాత్ర అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాజుగారి గది షూట్లో సమంత పాల్గొంది. అందుకు సంబంధించి ఓ స్టిల్ బయటకు వదిలింది. ఆ స్టిల్ చూస్తుంటే ఈ సినిమాలో దెయ్యం సమంతనే అనిపించకమానదు. సీరత్ కపూర్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యం ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తారు. అయితే… ఓం కార్ మాత్రం క్లూ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడంటే ఇందులో ఏదో మతలబు ఉండొచ్చు అని ఊహిస్తున్నారు సినీ జనాలు. ప్రేక్షకుల్ని మిస్ లీడ్ చేయడానికి సమంత క్యారెక్టర్ని ఇలా రివీల్ చేసే ఛాన్సుందని చెప్పుకొంటున్నారు. ఏదేమైనా హారర్ లుక్‌తో సమంత ఈ సినిమాపై అటెన్షన్‌ని మరింతగా పెంచింది. నాగ్, సమంత కలసి నటించడం.. రాజుగారి గదికి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సమంత ఈ పిక్‌తో ఆ వేడి మరింత పెంచేసింది.