స్పెషల్‌గా విష్ చేయాలా? అవసరం లేదు కదూ! ఈ రోజు సమంత బర్త్‌డే అని మ్యాగ్జిమమ్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే… తెలుగులో ఆమెకున్న ఫాలోయింగ్ అటువంటిది మరి. అయితే… ఈ ఏడాది సమంత బర్త్‌డేకి ఒక స్పెషాలిటీ వుంది. అదేంటో తెలుసా? అక్కినేని ఇంటి కోడలు అయ్యాక వచ్చిన తొలి పుట్టినరోజు ఇది. ఈ రోజు అక్కినేని నాగచైతన్య సతీమణిగా, అక్కినేని కోడలిగా తొలిసారి సమంత కేక్ కట్ చేయనున్నారు. ఆమెను స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఎవరైనా వాళ్ళింటికి వెళదామనుకుంటే ఒక్కసారి ఆగండి. సమంత హైదరాబాద్‌లో లేరు. భర్త నాగచైతన్యతో కలిసి శ్రీనగర్ వెళ్లారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గల గుల్మార్గ్లో వున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు రెండు మూడు రోజులు సెలవులు పెట్టి నిన్న మధ్యాహ్నం శ్రీనగర్ వెళ్లారు. వచ్చే వారం అక్కణ్ణుంచి తిరిగొస్తారని సమాచారం. ఇటీవల ‘రంగస్థలం’లో రామలక్ష్మిగా ప్రేక్షకుల మనసు దోచిన సమంత, మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే టు సమంత.