దర్శకుడిలో క్లారిటీ లేకపోతే… ఎంత ఇబ్బందో చెప్పడానికి బ్రహ్మోత్సవం సినిమానే ఓ పెద్ద ఉదాహరణ. శ్రీకాంత్ అడ్డాల ఈ కథపై ఉన్న ప్రేమతో.. ఇప్పటికే చాలా ఫుటేజ్ తీసినట్టు వార్తలొచ్చాయి. మధ్య మధ్యలో కంటిన్యుటీ సీన్లు మిస్సవ్వడంతో అక్కడక్కడ రీషూట్లు చేయాల్సివచ్చింది. ఎంత చేసినా.. అలాంటి అన్ ఫిన్ష్డ్ సీన్లు ఇంకొన్ని మిగిలిపోయాట. ఇప్పుడు ఆ సీన్ల కోసం మళ్లీ ప్రధాన తారాగణం కాల్షీట్లు సేకరించే పనిలో ఉంది బ్రహ్మోత్సవం టీమ్. అందరూ సహకరిస్తున్నా, సమంత మాత్రం ‘నా వల్ల కాదు..’ అంటోందట.
సమంత చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. అఆ షూటింగ్ లో తన పార్ట్‌ని ఫినిష్ చేసింది సమంత. బ్రహ్మోత్సవం కూడా పూర్తయినట్టే. అందుకే ఇప్పుడు జనతా గ్యారేజీ టీమ్‌తో జాయిన్ అయ్యింది. అయితే.. ‘మాక్కొన్ని కాల్షీట్లు కావాలి’ అని బ్రహ్మోత్సవం టీమ్ బతిమాలుతోన్నా సమంత ఒప్పుకోవడం లేదట. ‘ఇప్పటికే చాలా కాల్షీట్లు ఇచ్చా.. నేను చేయాల్సిన సినిమాలు ఇంకా ఉన్నాయి.. కావాలంటే. నేను వచ్చే వరకూ ఆగండి’ అని ఖరాఖండిగా చెప్పేస్తోందట. సమంత బెట్టు ఇలా బెట్టు చేసి చెట్టెక్కి కూర్చోవడంతో బ్రహ్మోత్సవం సినిమా ఇబ్బందుల్లో పడినట్టైంది.
మే మొదటి వారంలో ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని మహేష్ భావిస్తున్నాడు. సమంత కోపరేషన్ లేకపోతే… అది కుదరని పని. ఒకవేళ బ్రహ్మోత్సవం సరైన టైమ్‌కి రాకపోతే… దానికి కారణం సమంతే అవుతుందిప్పుడు. మరి మహేష్ అభిమానుల దృష్టిలో సమంత విలన్ అవుతుందా? లేదంటే పెద్ద మనసు చేసుకొని చిత్రబృందానికి సహకరిస్తుందా?? చూడాల్సిందే.