సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉండే కథానాయిక.. సమంత. అయితే.. ఫ్యాన్స్‌ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాలి. కొన్ని ప్రశ్నలు గందరగోళంలో పడేస్తుంటాయి. తిక్క రేగేలా చేస్తాయి. అలాంటప్పుడు కూడా కాస్త సహనం ప్రదర్శించాలి. సమంత అదే చేస్తోంది.
సమంత మళ్లీ ఫ్యాన్స్ తో టచ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా.. ‘మీరు మళ్లీ పెళ్లి చేసుకోవొచ్చు కదా’ అంటూ ఓ అభిమాని సమంతని ప్రశ్నిస్తే.. సమంత రెచ్చిపోలేదు. ‘ఇది నా పర్సనల్ విషయం’ అంటూ క్లాస్ పీకలేదు. చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ‘రెండో పెళ్లి ఓ బ్యాడ్ ఇన్వెస్టిమెంట్’ అంటూ గణాంకాలతో సహా చూపించింది. మొదటిసారి పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్లకంటే, రెండోసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్న వారి సంఖ్యే అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సమంత ఈ డేటాని ఎక్కడ నుంచి కలెక్ట్ చేసిందో తెలీదు కానీ.. ఓ ప్రశ్నను తాను ఎదుర్కొన్న విధానం మాత్రం సింప్లీ సూపర్బ్. దాంతో.. సమంత రెండో పెళ్లి విషయంలో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసినట్టైంది. సమంత ఇప్పుడు వ్యక్తిగత జీవితం కంటే వృత్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తోంది. నిర్మాతగానూ మారే ప్రయత్నాల్లో ఉంది. త్వరలో సమంత నుంచి నిర్మాతగా ఓ కొత్త సినిమా శ్రీకారం చుట్టుకోనుంది.