సమంత సోషల్ మీడియా యాక్టివ్ గా వుంటుంది, తన సినిమా కబుర్లతో పాటు తనపై వచ్చే అనే అంశాలని కూడా సోషల్ మీడియా వేదికల ద్వారా సమాధానం ఇస్తుంటుంది. తాజాగా అబ్బాయిలకి క్లాస్ పీకింది సామ్. నాగచైతన్య.. ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా సమంతసన్నిహితులే చేస్తున్నారని చైతన్య అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ కి పని చెప్పింది సామ్. ‘‘అమ్మాయిపై వదంతులు వస్తే అవి నిజమే అనుకుంటారు. అబ్బాయిపై అలాంటి వదంతులు వస్తే అమ్మాయే చేయించిందంటారు’’ అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ‘‘అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. మీరు మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి’’ అని క్లాస్ పీకింది సమంత. ఇప్పుడు సమంత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Rumours on girl – Must be true !!
Rumours on boy – Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6— Samantha (@Samanthaprabhu2) June 21, 2022