స్టార్ కథానాయిక అయినా సరే, ఎప్పుడూ నిర్మాతలకు అందుబాటులో ఉండేది సమంత. పారితోషికం విషయంలో పేచీ పెట్టిన సందర్భాలు ఇప్పటి వరకూ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో సమంత పూర్తిగా మారిపోయిందని సమాచారం. పారితోషికం ఎంత తీసుకోవాలి? అనే దానిపై సమంత… కాస్త పట్టుదలకు పోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. సమంత ఇటీవల రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకుంది. ఓ సినిమా కోసం తను రూ.3 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. సమంత పారితోషికం మొన్నటి వరకూ.. రూ.2 కోట్లలోపే. పైగా తెలుగులో తను ఈమధ్య సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. దాంతో పాటు… కొత్త కథానాయికల హవా పెరగడం, కమర్షియల్ సినిమాలకు సమంత దూరం అవ్వడంతో.. తనని నిర్మాతలు లైట్ తీసుకున్నారు. కానీ సమంత రూటు మార్చింది. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది. దాంతో కొత్త కథలు వింటోంది. సమంత ఈమధ్య తెలుగులో సినిమాలు చేయకపోయినా, తన మార్కెట్ తనకుంది. కాకపోతే.. మరీ 3 కోట్లు అనేసరికి.. నిర్మాతలు ఆలోచనలో పడుతున్నార్ట. పూజా హెగ్డే, రష్మిక లాంటి వాళ్లు 2 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశారు. తనకీ అదే పారితోషికం ఇస్తానంటే కుదరదని మొండికేస్తోందట. తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, బ్యాంకు బాలెన్స్ పెంచుకోవడం సమంత టార్గెట్ గాకనిపిస్తోంది. ఇలాగైతే.. నిర్మాతలు సమంతని భరించడం కష్టమే.