చెన్నైలో అకాల వర్షాల కారణంగా తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ కూడా ప్రస్తుతం సజావుగా సాగుతుంది. అయితే చెన్నై ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా ఎంత ఆస్తి నష్టం జరిగిందని దానికి ఖచ్చితమైన తేలలేదు. ఇక చెన్నై వర్షాలు సృష్టించిన బీభత్సానికి మన టాలీవుడ్ స్టార్ తలా ఒక చెయ్యి వేసి సాయం అందిస్తున్నారు.
స్టార్ హీరోలందరు తమ వంతు సహయాన్ని విరాళంగా ప్రకటించగా కుర్ర హీరోలందరు ‘మన మద్రాస్ కోసం’ అని ఒక కార్యక్రమాన్ని కూడా మొదలెట్టి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక ఇదే దారిలో సమంత కూడా 30 లక్షల విరాళాన్ని సి.ఎం సహాయ నిధికి అందించినట్టు తెలుస్తుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకే రకమైన అభిమానులను ఏర్పరచుకున్న సమంత జనాలకు కష్టం వస్తే తాను కూడా సహయం చేస్తానని ముందుకు వచ్చింది.
ఇప్పటికే మనసారా సినిమాతో టాలీవుడ్ లో పరిచయమై తమిళంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీ దివ్య 10 లక్షల విరాళాన్ని ప్రకటించి తన ఉదార స్వభావాన్ని చాటుకుంది. హాన్సిక కూడా 10 లక్షల విరాళం అందించినట్టు సమాచారం. ఇక వారి దారిలోనే సమంత కూడా 30 లక్షల విరాళాన్ని అందించి తన గొప్ప మనసుని చాటుకుంది. ఇప్పటికే సమంత ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ధీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న చిన్న పిల్లలకు చేదోడు వాదోడుగా ఉంటుంది.