నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా… అని మీడియా సమక్షంలోనే చెప్పేసింది సమంత. అక్కడితో ఆగలేదు.. ఓ హీరోని ప్రేమిస్తున్నా.. మేం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ హింట్ కూడా ఇచ్చేసింది. ఆ తరవాత సమంత చుట్టూ హైడ్రామా నడిచింది. సమంత.. ఆ హీరో కలసి సహజీవనం కూడా మొదలెట్టేశారన్న గుసగుసలు వినిపించాయి. వాళ్లిద్దరూ బాల్కనీలో ఉన్న వీడియో కూడా నెట్ ప్రపంచంలో సందడి చేసింది. సమంత ఇంట్లో ప్రేమ పెళ్లికి అభ్యంతరాలు లేకపోయినా, సదరు హీరో మాత్రం ఇంట్లో గట్టి ఫైటింగే చేయాల్సివచ్చింది. ఇప్పటికీ సమంత ప్రేమికుడు.. ఇంట్లోవాళ్లని ఒప్పించే ప్రయత్నాల్లోనే ఉన్నాడట. అయితే ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చాయని టాక్.
త్వరలోనే సమంత నిశ్చితార్థం కూడా చేసుకోబోతోందని, అందుకు తగిన ఏర్పాట్లూ మొదలైపోయాయని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థ వేడుకని నిడారంబరంగా చేయాలా, లేదంటే.. అట్టహాసంగా చేయాలా? అనేదే తేలడం లేదట. నిశ్చితార్థ వేడుక సింపుల్ గా చేసేసి.. పెళ్లి మాత్రం గ్రాండ్గా జరపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. నిశ్చితార్థంకీ, పెళ్లికీ అట్టే సమయం కూడా లేదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే సమంత కూడా ఎంగేజ్మెంట్ హడావుడిలో పడిపోయిందని తెలుస్తోంది. మరి ఇదెంత వరకూ నిజమో తెలియాలంటే సమంత మళ్లీ ట్విట్టర్లో పెళ్లి ప్రస్తావన తీసుకురావాల్సిందే.