తెలుగులో, తమిళంలో సమంత స్టార్ హీరోయిన్. నటిగా, ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూ మంచి మనసున్న మనిషిగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. సమంత నటించే సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఎంతోమంది వున్నారు… ‘సామ్ సినిమా ఎప్పుడొస్తుందా?’ అంటూ! అయితే… సమంత అమ్మానాన్నలకు మాత్రం ఆమె సినిమా వస్తుందంటే నాగచైతన్య మెసేజ్ చేస్తాడట! ఎందుకు? అంటే… సమంత ఫ్యామిలీ సినిమాలకు చాలా దూరంగా వుంటోంది. నాగచైతన్య స్వయంగా చెప్పిన విషయమిది. “అత్తమామలతో సన్నిహితంగా వుంటాను. సినిమాల మీద వాళ్లకు పెద్దగా ఆసక్తి లేదు. సమంత సినిమా విడుదల అవుతుంటే ‘మీ అమ్మాయి నటించిన సినిమా విడుదలవుతోంది చూడండి’ అని వాళ్లకు నేనే మెసేజ్ పెడుతుంటా. సమంత బ్రదర్స్ కూడా సినిమాలకు దూరమే. ఒక బ్రదర్ అమెరికాలో, మరో బ్రదర్ చెన్నైలో వుంటున్నారు” అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. చెన్నై వెళ్ళినప్పుడు అత్తమామలను కలుస్తానని తెలిపాడు.