సమంత బ్రేక్ తీసుకుంది. వైద్యం కోసం అమెరికా వెళ్ళిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆమె పెదవి విప్పలేదు కానీ.. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావడానికి ప్లాన్ సిద్దం చేసుకుంది. మరో రెండు నెలలు పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించింది. విజయ దేవరకొండ- శివ నిర్వాణ ఖుషి సినిమాలో సమంత హీరోయిన్. అయితే సమంత అందుబాటులో లేకపోవడంతో కొన్ని రోజులుగా షూటింగ్ ఆగింది. ఇప్పుడు సమంత నవంబర్ నుండి ఖుషికి డేట్లు ఇచ్చింది .
అలాగే బాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతుంది సమంత. దిని కూడా డేట్లు కేటాయించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది. అలాగే కొత్త కథలు కూడా వుంటుంది. సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’ విడుదలకు రెడీ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సమంత చురుగ్గా పాల్గోవడానికి రెడీ అవుతుంది. మొత్తానికి మరో రెండు నెలలు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టనుంది సమంత.