విడుదలకు ముందు కొన్ని సినిమాలకే పాజిటీవ్ వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. `ఓ బేబీ` విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ టాకే నడుస్తోంది. టీజర్లూ, ట్రైలర్లూ.. వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్రబృందం మాటల్లో కాన్ఫిడెన్స్ బాగానే కనిపిస్తోంది. సమంత అయితే ఈ సినిమాని ఓన్ చేసేసుకుంది. తనైతే మరింత నమ్మకంగా మాట్లాడుతోంది. `నా కెరీర్లో ఇదే బెస్ట్ సినిమా` అంటోంది. మహానటి, రంగస్థలం, యూ టర్న్ – ఇలా.. సమంత ఈమధ్య గొప్ప పాత్రలనే ఎంచుకుంటోంది. వాటిని మించిన పాత్ర `ఓబేబీ`తో దక్కిందంటే – నటిగా మరో మెట్టు ఎదిగినట్టే కదా? సమంతలోని అత్యుత్తమ ప్రతిభ ఈ సినిమాతో బయటపడబోతోందని ఈ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. రాఘవేంద్రరావుకి ఈ సినిమా చూపించారు. ఆ వెంటనే.. సమంతని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ కూడా పెట్టారు. వెంకటేష్ కూడా ప్రీ రిలీజ్ ఈ వెంట్లో `బేబీ అదరగొట్టేసింది..` అంటూ సమంతకి కితాబులు అందించాడు.
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సమంత నటన ఓ రేంజ్లో ఉంటుందని టాక్. సినిమా అంతా అల్లరి అల్లరిగా నటించేసిన సమంత, ఆ రెండు చోట్ల మాత్రం కన్నీళ్లు పెట్టించిందట. అసలు ఈ సినిమాకి అతి పెద్ద హైలెట్ ఆ రెండు సన్నివేశాలే అని తెలుస్తోంది. మొత్తానికి మరో సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించేస్తోంది సమంత. బేబీగా తన విశ్వరూపం ఎలా ఉందో చూడాలంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.