సమంత మళ్లీ లవ్‌లో పడింది. ఓ హీరోతో తాను లవ్‌లో ఉన్నట్టు… చెప్పేసింది. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ కూడా ఇచ్చేసింది. మరి ఆ హీరో ఎవరనేదే తేలడం లేదు. సమంతతో కొంతకాలంగా ఓ యువ హీరోతో క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని టాక్. అతను ఓ హీరోకి తనయుడని, సోదరుడు కూడా… టాలీవుడ్లో హీరోగా చలామణి అవుతున్నాడని తెలుస్తోంది. వాళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత లవర్ గా టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో పేరు మార్మోగిపోతోంది. వీళ్లిద్దరూ కలసి గతంలో నటించారు కూడా. హిట్ పెయిర్ అన్న పేరు కూడా తెచ్చుకొన్నారు. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి సమంత ఇష్టపడడం లేదు. ”మా ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకొన్నారు. పెద్ద వాళ్ల అభ్యంతరం కూడా లేదు. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతా” అంటోంది,
గతంలో ఓసారి తన లవ్ బ్రేక్ అవ్వడం వల్లే.. ఈ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచిందట సమంత. తన కాబోయే భర్తకి చాలా ఓపిక అని, వంట బాగా చేస్తాడని, సహాయం చేసేంత గొప్ప మనసు ఉందని కితాబులిస్తుంది. అయితే ఆ పేరు మాత్రం చెప్పడం లేదు. ”అతి త్వరలో ఆ పేరుని అందరి ముందు చెప్పేస్తా. అంత వరకూ ఓపిక పట్టండి” అని హింట్ కూడా ఇచ్చేసింది సమంత. మరి.. సమంత ఎప్పుడు ఈ బాంబు పేలుస్తుందో చూడాలి.