సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీతోపాటు సీఎల్ వెంకట్రావుపై కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్లో పేర్కొంది. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరింది.
నాగ చైతన్యతో వివాహ బంధానికి స్వస్తి పలికిన తర్వాత సమంతపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. డా .సీఎల్ వెంకట్రావు మాట్లాడిన ఓ వీడియో చాలా వైరల్ అయింది. ఇందులో సమంత అబార్షన్ చేసుకున్నట్లు, సమంతకి తల్లి కావడం ఇష్టం లేనట్లు, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరిస్ లో బరి తెగించి నటించినట్లు కొన్ని కామెంట్లు చేశాడు సీఎల్ వెంకట్రావు. ఆ కామెంట్లు ఆధారం చేసుకొని కొన్ని యుట్యూబ్ ఛానళ్ళు రెచ్చిపోయి వీడియోలు చేశాయి. వీటిపై ఇప్పుడు పరువు నష్టం దావా వేసింది సమంత.