కథానాయికల పారితోషికంపై ఎప్పుడూ ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వచ్చిన కథానాయికలు ఎప్పటి కప్పుడు తమ రేట్లని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ – అండ్ సప్లై సూత్రం ప్రకారం నిర్మాతలూ భరిస్తూనే ఉంటారు. ప్రస్తుతానికి సమంత రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈమధ్య సమంత కాస్త తగ్గింది, అందుబాటులో ఉంటుంది అనుకొన్నారంతా. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు.
రాజ్ అండ్ డీకేతో చేసిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం సమంత ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకొందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకొంటున్నారు. ఇటీవల విజయ్ సినిమాకు సంతకాలు చేసింది సమంత. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమాకు గానూ.. సమంత రూ.6 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని టాక్. ఇప్పటి వరకూ ఓ సినిమాకు గానూ సమంత అందుకొన్న అత్యధిక పారితోషికం ఇదే. స్టార్ హీరోల సరసనే ఇంతింత డిమాండ్ చేస్తుంటే ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గానూ సమంత ఎంత అందుకొంటుందో ఊహించుకోవొచ్చు. ఇటీవల సమంత కమర్షియల్ యాడ్స్లోనూ మెరుస్తోంది. ఒకొక్క వాణిజ్య ప్రకటనకు రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తన పారితోషికంతో నిర్మాతలకు చెమటలు పట్టించేస్తోంది సమంత.