సమంతపై వచ్చినన్ని హాట్ హాట్ వార్తలు మరో హీరోయిన్‌పై పుట్టలేదేమో?? ఎప్పుడు ఏ వార్త వచ్చినా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ అందర్నీ షాక్‌కి గురిచేసింది. సిద్దార్థ్ తో ప్రేమాయణాన్ని బహిరంగంగానే ఒప్పుకొంది. ఆ ప్రేమ పెటాకులవ్వడంతో కొంతకాలం సింగిల్‌గానే ఉంది. ఆ తరవాత మరో కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని ప్రచారం మొదలైంది. ఇప్పుడో క్రేజీ దర్శకుడితో కూడా అంతే సాన్నిహిత్యంతో స్నేహం కొనసాగిస్తోందట. ఇప్పుడు ఆ విషయాన్ని ఒప్పుకొనీ ఒప్పుకోనట్టు జవాబు చెప్పింది సమంత.
24 సినిమా ప్రమోషన్ల కోసం ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ వచ్చింది సమంత. ”మీరు ఇంకా సింగిల్‌గానే ఉన్నారా” అని అడిగితే… ”నేను సింగిల్ అని ఎవరు చెప్పారు? నేనెప్పుడూ చెప్పలేదే`”అంటూ… నవ్వేసింది. సమాధానం సరదాగానే ఉన్నా… నిజాన్ని ఒప్పుకోకుండానే ఒప్పుకొన్నట్టు కవరింగ్ ఇచ్చింది. అంటే సమంత సింగిల్ కాదు, ఎవరితోనో మింగిల్ అవుతున్నట్టే కదా అర్థం. అదెవరూ అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఆ రహస్యాన్నీ సమంత త్వరలోనే బయటపెట్టేయాలని ఆశిద్దాం.