టాలీవుడ్ జెస్సి సమంత అంటే అదో సెపరేట్ క్రేజ్.. ఏ మాయ చేసావే సినిమా నుండి అమ్మడి ట్రాక్ చూస్తే తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూనే వస్తుంది. అయితే టాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాధించి స్టార్ హీరోయిన్ అయిన సమంత తన సొంత భాషలో మాత్రం పట్టు సాధించలేకపోతుంది. దాదాపు 6 సంవత్సరాలుగా అక్కడ కూడా సినిమాలు చేస్తున్నా చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి లేదు. విజయ్ తో చేసిన కత్తి సినిమా హిట్ కొట్టినా అది కాస్త విజయ్ అకౌంట్లో చేరింది.
రీసెంట్ గా వచ్చిన చియాన్ విక్రం ’10 ఎన్రదుకుల్ల’ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నా అది కూడా ఫ్లాప్ అయ్యేసరికి మరింత నిరుత్సాహంలో పడ్డది సమంత. తనకు మళ్లీ హిట్ ఇచ్చే హీరో విజయే అని నమ్ముతుంది అందుకే అట్లి డైరక్షన్లో విజయ్ హీరోగా చేస్తున్న సినిమాపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది. రాజు రాణి సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు విజయ్ సినిమాను కూడా మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్నాడట.
కోలీవుడ్లో తనకు హిట్ ఇచ్చే హీరో విజయ్ ఒక్కడే అని నమ్ముతుంది అందుకే ఆ హీరో మీదే గురి పెట్టుకు కూర్చుంది. ఇదే గాకా ధనుష్ తో ఓ సినిమా చేసింది సమంత.. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు కాని సమంత మాత్రం బయట గెలుస్తుంది కాని తన సొంత భాషలో మాత్రం హిట్లు కొట్టలేకపోతుంది.. మరి తమిళ తంబీలకు సమంతా ఎందుకు నచ్చట్లేదో వారికే తెలియాలి.