సమంత మూడ్ మొత్తం మారిపోయిందిప్పుడు. తన దృష్టి పెళ్లిపై మళ్లిందని.. అందుకే సినిమాలపై ఫోకస్తగ్గించిందని టాలీవుడ్ టాక్. అ.ఆ సూపర్ హిట్‌తో త్రివిక్రమ్‌తో పాటు సమానంగా వాటా అందుకొంది సమంత. సమంత కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్. వ్యక్తిగతంగా అ.ఆ చాలా మేలు చేసింది. అ.ఆ తరవాత సమంత ముందుకు ఈ తరహా ప్రాజెక్టులు కొన్నొచ్చాయని, అయితే సమంత దేనికీ ఓకే చెప్పలేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో సమంత చేతిలో ఉన్న ఏకైక చిత్రం… జనతా గ్యారేజీ. తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ఇవి రెండూ పూర్తయ్యాక సమంత పెళ్లి తాను కోరుకొన్నవాడితోనే జరగబోతోందని టాక్. ఇది కేవలం తాత్కాలిక దూరమేనా, లేదంటే పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదన్న కండీషన్‌కి సమంత ఒప్పుకొందా అనేది తెలియడం లేదు.
సమంత కూడా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతోంది. ”పెళ్లి, పిల్లలు, సంసారం… ఇలాంటి జీవితం కావాలనిపిస్తోంది.. సినిమాలు బోర్ కొట్టాయి. ఎప్పటికైనా రిటైర్మెంట్ తప్పదు కదా.. ” అని ఓరోజు, ”చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయి. పెళ్లయితే మాత్రం సినిమాలు ఎందుకు వదిలేయాలి” అని మరో రోజు ఇలా పరస్పర విరుద్ధమైన కామెంట్లు చేస్తోంది. అంటే… సమంతే చాలా కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. ఇప్పటికైతే సమంత విశ్రాంతి కోరుకొంటోంది. పెళ్లికి ముందు కనీసం కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలన్నది సమంత ఆలోచన కావొచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సమంత మూడ్ మొత్తం మారింది.. మరి చివరికి ఏమవుతుందో?